వణికిన ఈశాన్యం
02-06-2025 01:11 AM
- ముంచెత్తిన వర్షాలు
- సుమారు 30 మంది మృతి
గువహటి, జూన్ 1: ఈశాన్య రాష్ట్రాలు వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు సుమారు 30 మంది మృతి చెందారు. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, మిజోరాం రాష్ట్రాలను వరదలతో పాటు కొండచరియలు కూడా వణికించాయి.
అస్సాంలోని 12 జిల్లాల పరిధిలో 60 వేల మంది ప్రజలు ఈ వర్షాల వల్ల గూడు కోల్పోయారు. అనేక కుటుంబాలు ఆశ్రయం కోల్పోయాయి. రహదారులు, మౌలిక సదుపాయాలు భారీ స్థాయిలో దెబ్బతిన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎస్డీఆర్‌ఎఫ్, ఐటీబీపీ బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి.




