calender_icon.png 21 July, 2025 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా బోనాల ఉత్సవాలు

21-07-2025 01:09:46 AM

చేగుంట, జూలై 20 : మహంకాళి అమ్మవారి ఆశీస్సులు చేగుంట ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు దుబ్బాక కాంగ్రెస్ ఇంచార్జ్ సి హెచ్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదివారం చేగుంట పట్టణ కేంద్రంలోని శ్రీ మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున బోనాలు తీసి ఊరేగించారు. అమ్మ ఆశీ స్సులు ఉండాలని ప్రార్థించారు. మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, వివిధ సంఘాల నాయకులు, పట్టణ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీనివాస్ రెడ్డి ని ఘనంగాసన్మానించారు. 

వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు...

తూప్రాన్ :  ప్రతి ఏటా తూప్రాన్ పట్టణ కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు వైభవంగా కన్నుల పండుగగా నిర్వహిస్తారు. అందులో భాగ ంగా మున్సిపల్ అధికారులు, మాజీ పాలక వర్గం సహకారంతో మహంకాళి జాతర ఉత్సవాలు నిర్వహించారు.

వివిధ వార్డులో నుండి మహిళలు అమ్మవారికి బోనాలను వివిధ రకాల విన్యాసాలతో బోనాలు సమర్పించారు. దారి పొడుగునా శివశక్తుల పూనకాలతో, పోతరాజుల విన్యాసాలతో, తొట్టెల ఊరేగింపులతో ఎక్కడ లేని విధంగా కోలాహలంగా జాతర ఉత్సవాలను మూడు రోజులపాటు కొనసాగుతాయి. 

జీడిపల్లిలో అమ్మవార్లకు బోనాలు...

మనోహరాబాద్ : మనోహరాబాద్ మండలం జీడిపల్లి గ్రామంలో అమ్మవార్లకు బోనాల జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు, కుల సంఘాల ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలను అద్భుత నిర్వహించారు, పోతరాజుల విన్యాసాలు, తొట్టేల ఊరేగింపులు,

పనివారల చెర్న కోలాటాలతో అంగరంగ వైభవంగా పలు విధుల్లో మహిళలు బోనాలు తీసుకొని పూనకాలతో అమ్మవారి ఆలయ ముందు సమర్పించారు. కార్యక్రమంలో గ్రామంలోని నాయకులు, వ్యాపార వర్తక సంఘ నాయకులు, కుల పెద్దలు పాల్గొని విజయవంతంచేశారు.

అల్లీపూర్ లో ఘనంగా బోనాలు...       

జహీరాబాద్: జహీరాబాద్ మండలం లోని అల్లిపూర్ గ్రామంలో గ్రామ దేవతలకు బోనాలను ఘనంగా సమర్పించారు. గ్రామ ప్రజలందరూ ఇంటింటి బోనాలు తీసుకొ చ్చి గ్రామ దేవతలైన దుర్గమ్మ ఊడరమ్మ పోచమ్మ దేవతలకు బోనాలను సమర్పిం చారు. ఊరేగింపులో శివసత్తులు, డోలు వాయిద్యాలతో గ్రామం మారుమ్రోగింది.

బోనం ఎత్తిన మెదక్ కలెక్టర్ దంపతులు 

మెదక్, జూలై 20 (విజయక్రాంతి): నల్ల పోచమ్మ అమ్మ వారికి ఆదివారం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కుటుంబ సమేతంగా బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. మెదక్ జిల్లా కేంద్రంలోని తారక రామ నగర్ నల్ల పోచమ్మ ఆలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అయన సతీమణి శ్రీజ అమ్మ వారికి బోనం తీసుకువచ్చి మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు.

బోనాల విశిష్టతను గురించి కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారని తెలిపారు. పండుగను ఆషాడ మాసంలో జరుపుకుంటారు, ఇది సాధారణంగా జూలై లేదా ఆగస్టు నెలలో వస్తుందని.

ఈ పండుగలో, స్త్రీలు అమ్మవా రికి నైవేద్యంగా బోనం (అన్నం) సమర్పి స్తారని చెప్పారు. గ్రామాల్లో కులవృత్తుల సంప్రదాయం ప్రకారం బోనాల వేడుకలను భారీ ఎత్తున నిర్వహిస్తారు. పండుగ మొదటి, చివరి రోజులలో ఎల్లమ్మదేవికి ప్రత్యేక పూజలుచేస్తారన్నారు. 

వనదుర్గమ్మను దర్శించుకున్న కలెక్టర్...

ఏడుపాయల దుర్గామాతను కలెక్టర్ రాహుల్ రాజ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారి పేర ప్రత్యేక పూజ నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.  ఆలయ సిబ్బంది శ్రీనివాసరావు, అర్చకులు  పాల్గొన్నారు.

పాల్గొన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పోరేటర్లు

పటాన్ చెరు, జులై 20 :పటాన్ చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఆషాడ మాస బోనాలు ఆదివారం వైభవంగా జరిగాయి. పటాన్ చెరు, అమీన్ పూర్,  జిన్నారం, గుమ్మడిదల మండలాలలో జరిగిన ఆషాడ మాస బోనాల ఉత్సవాలలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్పనగేశ్, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి,

అమీన్ పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ పాండు రంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నర్సింహాగౌడ్, మాజీ జెడ్పీవైస్ చైర్మన్ కే.ప్రభాకర్, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, నాయకులు పాల్గొన్నారు.  ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలు అమ్మవారి ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్ల మద్య మళలు బోనాలతో అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా వెళ్లి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

యువకులు తొట్టెల ఊరేగింపు డీజే చప్పుళ్ల మద్య నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలస్తుందన్నారు. అమ్మవారి దయతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లుచెప్పారు.

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

మెదక్, జూలై 20(విజయక్రాంతి): హవెలిఘనపూర్ మండలంలోని సర్ధన గ్రామంలో మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలలో మెదక్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ మహంకాళి అమ్మవారి కృపాకటాక్షాలతో గ్రామ ప్రజలందరూ చల్లగా చూడాలని, పాడిపంటలతో సుభిక్షంగా ఉండే విధంగా అమ్మవారిని వేడుకున్నారు.

అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యేని శాలువాతో  ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హవెలిఘనపూర్ మండల పార్టీ అధ్యక్షులు సిహెచ్.శ్రీనివాస్ రెడ్డి, తాజా మాజీ వైస్ ఎంపీపీ రాధాకిషన్ యాదవ్, గ్రామ అధ్యక్షులు కాపు కిషన్, నాయకులు సతీష్ రావు, రాజేశ్వరరావు,మేకల సాయిలు, రామచంద్ర రెడ్డి, సాప సాయిలు, ఆలయ కమిటీ సభ్యులు  కమ్మరి శ్రీనివాస్, వడ్ల విఠల్, ప్రసాద్, రాములు, సిద్ధిరాములు, సత్యనారాయణ పాల్గొన్నారు.