10-08-2025 11:13:36 PM
పాల్గొన్న ఎమ్మెల్యే మదన్మోహన్
ఆల్ ఇండియా బంజారా సంఘం రాష్ట్ర నాయకులు రాములు నాయక్
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి బంజారా తెగ ఆధ్యాత్మికత, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే తీజ్ పండుగ ఎల్లారెడ్డి పట్టణంలో ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాల నుంచి భారీ ఎత్తున బంజారా నాయకులు, మహిళలు, యువతులు హాజరై పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ఆల్ ఇండియా బంజారా సంఘం రాష్ట్ర నాయకులు రాములు నాయక్, హాజరయ్యా పండుగ శుభారంభానికి శోభాయమానులయ్యారు.
బంజారా యువత కోరిక మేరకు, అవివాహిత యువతులు సంప్రదాయ దుస్తుల్లో మొలకెత్తిన గోధుమ మొక్కలను బుట్టల్లో మోసుకుంటూ తీజ్ మాత పూజను ఆరంభించి, భక్తిరసపూరిత ర్యాలీ నిర్వహించారు. భక్తిగీతాలు, ప్రార్థనలు, సంప్రదాయ నృత్యాలతో పట్టణం ఉత్సాహభరితంగా మారింది. తీజ్ మాతకు మొలకలను సమర్పించి శుభార్ధక కార్యక్రమాలతో వేడుక కొనసాగింది. బంజారా మహిళల మంగళస్వరూప అలంకరణ, పాటలు, పారాయణాలు పండుగ వాతావరణానికి మరింత అందం జోడించాయి.
ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ మాట్లాడుతూ, బంజారా సోదరులు సోదరులు జరుపుకునే తీసుకు పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉందని బంజారాలారా దైవం, సేవాలాల్ మహారాజ్ ,కు ప్రత్యేక పూజలు నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారని తీజ్ పండుగ బంజారా తెగలోని ఆధ్యాత్మిక నిబద్ధతను మాత్రమే కాకుండా, యువతలో సమర్పణ, ఆత్మనిబ్బంధం వంటి విలువలను బోధించే ఆచారంగా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది,అన్నారు.ఈ కార్యక్రమంలో
నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సర్దార్ నాయక్, మండల అధ్యక్షుడు కుర్మ సాయిబాబా, మాజీ జెడ్పిటిసి సామెల్, తిమ్మారెడ్డి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ బొండ్ల సాయిలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంజీవరెడ్డి, సొసైటీ డైరెక్టర్ సుఖేందర్ రెడ్డి, ఎల్లారెడ్డి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్ నాయక్, ఆల్ ఇండియా బంజారా సంఘం ఎల్లారెడ్డి మండల అధ్యక్షుడు కోల రాములు, నాగిరెడ్డిపేట్ మండల అధ్యక్షుడు దేవసోత్ రమేష్, రెండు మండలాల బంజారా నాయకులు, మహిళలు, యువతులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.