04-08-2025 12:00:00 AM
సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 3, (విజయక్రాంతి)మహిళా శక్తిని చాటి చెప్పేవే బోనాల జాతరలు, పండుగలని, అనాదిగా తెలంగాణ రాష్ట్రవ్యాపితంగా పెద్ద ఎత్తున బోనాల పండుగలు జరుపుకొని మహిళలకు ఉన్నత స్థానంలో నిలుపుతున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి, కొత్తగూడెం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎస్ కె సాబీర్ పాషా అన్నారు.
పట్టణంలోని రైతుబజారులో వ్యాపారుల కుటుంబాలు ఆదివారం నిర్వహించిన శ్రావణ మాస బోనాల ఉత్సావాల్లో అయన పాల్గొని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్త్రీలను పూజించడం తెలంగాణ సంస్కృతిలో మహొన్నతమైన సంప్రదాయమని, అనాదిగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని నేటితరం కొనసాగించడం అభినందనీయమన్నారు.
అనాదిగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలను ఆచరిస్తూ వాటిని భావితరాలు అందించడం ప్రతిఒక్కరి బాధ్యత అని, ఇలాంటి ఉత్సవాలు ప్రజల మధ్య ఐక్యతను పెంచి రాగద్వేషాలను, అంతరాలను దూరం చేస్తాయని తద్వారా సమాజంలో శాంతి నెలకొంటుందన్నారు. కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, రాము, మదన్ లాల్, వేణు, పద్మ, కుమారి, తులసి తదితరులు పాల్గొన్నారు.