calender_icon.png 4 August, 2025 | 10:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు

04-08-2025 08:30:46 AM

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు(BC Reservation Bill) రాష్ట్రపతి ఆమోదం కోసం ఢిల్లీలో పోరాటం చేయనున్నారు. బీసీ బిల్లును రాష్ట్రపతి ఆమోదించాలని కోరుతూ ఢిల్లీలో ఈ నెల 6న ధర్నా చేయనున్నారు. ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Bomma Mahesh Kumar Goud) పాల్గొనున్నారు. ధర్నాలో పాల్గొనేందుకు ప్రతి జిల్లా నుంచి 25 మందిని పంపాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ నేతలు ఇవాళ చర్లపల్లి నుంచి ప్రత్యేక రైతులో డిల్లీకి బయల్దేరనున్నారు. బీసీ రిజర్వేషన్ పెంపుపై చర్చ కోరుతూ రేపు పార్లమెంట్ లో వాయిదా తీర్మానం కోరనున్నారు. పార్లమెంట్ లో మంగళవారం నాడు కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇవ్వనున్నారు.

ఎల్లుండి జంతర్ మంతర్(Jantar Mantar) వద్ద కాంగ్రెస్ శ్రేణుల భారీ ధర్నా కార్యక్రమం ఉంది. బిల్లుకు ఆమోదం కోరుతూ ఈ నెల 7న రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం అందజేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జనహిత పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ... బీసీ రిజర్వేషన్లపై కేంద్ర నాయకత్వాన్ని అడిగే దమ్ము బీజేపీ ఎమ్మెల్యేలకు లేదని ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యేలను చూస్తే సిగ్గేస్తుందన్నారు. మూసి రివర్ ఫ్రంట్ అంటే తోకముడిచుకొని కిషన్ రెడ్డి డ్రామాలు అడుతున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృదికి అడుగడుగునా కిషన్ రెడ్డి మోకాలడ్డుతున్నారని మండిపడ్డారు. సికింద్రాబాద్ లో మెజార్టీ బీసీలు అన్న విషయం కిషన్ రెడ్డి మరిచిపోవద్దన్నారు. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పని అయిపోయిందని సూచించారు.