04-08-2025 12:00:00 AM
బోథ్, ఆగస్టు 3 (విజయక్రాంతి): కడుపు నొప్పి భరిం చలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. ఎస్సై శ్రీ సాయి తెలిపిన వివరాల ప్రకారం బోథ్ పట్టణానికి చెందిన దాసరి లక్ష్మారెడ్డి (76) అనే రైతు గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడన్నారు.
గతంలో అతనికి అపెండిక్స్ ఆపరేషన్ కూడా జరిగింది. అయితే గత రెండు రోజులుగా తీవ్రమైన కడుపునొప్పి కారణంగా మనో వేదనకు గురయ్యాడు. దింతో ఆదివారం ఉదయం తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.