04-08-2025 08:12:37 AM
మునగాల,(విజయక్రాంతి): వైశ్య రాజకీయ రణభేరి మహాసభకు తరలిన వైశ్యులు హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో(Nampally Exhibition Ground) వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు,మలిదశ తెలంగాణ ఉద్యమ నాయకుడు డాక్టర్ కాసం సత్యనారాయణ ఆధ్వర్యంలో జరుగు వైశ్య రాజకీయ రణభేరి సభకు మునగాల మండలానికి చెందిన ఆర్యవైశ్యులు ఆదివారం మండల కేంద్రం నుండి ర్యాలీగా తరలి వెళ్లారు.ఈ సందర్భంగా పలువురు వైశ్య నాయకులు మాట్లాడుతూ ఆధ్యాత్మిక,సామాజిక సేవ రంగంలో ముందుండి నడిపించే వైశ్యులు రాజకీయంగా వెనుకబాటుకు గురవుతున్నామని.రాజకీయ రణభేరి సభతో తమ సత్తా ఏమిటో ఇతర పార్టీలకు తెలిసే విధంగా తమ ఐక్యతను చాటుతామని అన్నారు.ఈ మహాసభకు తరలిన వారిలో నల్లపాటి శ్రీనివాసరావు,కందిబండ సత్యనారాయణ, ఎల్వి ప్రసాద్, పోదుగంటి శ్రీనివాస్ రావు, మరోపల్లీ శంకర్, రవి సార్ వంగవీటి గురుమూర్తి, పివిడి ప్రసాద్, చలపతి చెక్క కిషోర్ తదితరులు ఉన్నారు.