calender_icon.png 4 August, 2025 | 1:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వార్తను మార్ఫింగ్ చేసిన వ్యక్తిపై ఫిర్యాదు

04-08-2025 12:00:00 AM

కాగజ్‌నగర్, ఆగస్టు 3 (విజయక్రాంతి):   వివాదాస్పదమైన అంశాన్ని వార్త రూపకం గా మార్చి దానికి ఒక పత్రికలోగోను వాడి ఆ పత్రికలో వార్త వచ్చినట్లుగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి పై ఆదివారం కాగజ్ నగర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో డి.ఎస్.పి, టౌన్ సీఐ ప్రేమ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు.

కాగజ్ నగర్ మండలం చింతగూడ కోయవాగుకు చెందిన లెండుగురే శ్యామ్ రావు శనివారం వాట్సాప్ గ్రూప్‌ల్లో వివాదాస్పద రాజకీయ  అంశాన్ని వార్తగా తయారు చేసి ఒక పత్రికలో వచ్చినట్లుగా మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశాడు.  ఆయా గ్రూప్‌ల్లో వైరల్‌గా మారి పత్రిక ప్రతిష్ట దెబ్బ తినే విధంగా వ్యవహరించాడు.

అతనిపై చట్టరీత్యా చర్య తీసుకోవడంతో పాటు ,దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులను బయటకు తీసి వారిపై కూడా చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.  ఇలాంటి వారు భవిష్యత్‌లో పత్రికలు, మీడియా సంస్థల పట్ల ఇలా వ్యవహరించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు టి. సురేందర్ రావు సీఐ కి ఫిర్యాదు చేశారు.

డీఎస్పీని కలిసిన జర్నలిస్టులు

ఐకు ఫిర్యాదు చేసిన అనంతరం జర్నలిస్టులు కాగజ్ నగర్ డీఎస్పీ రామానుజం ను కలిసి పరిస్థితి వివరించారు. పత్రిక లోగోతో వార్తను సృష్టించి సోషల్ మీడియాలో వైర ల్ చేసిన వార్తను తొలగించాలని, సదరు వ్యక్తికి ఫోన్ చేసినా స్పందించకుండా, ఘర్ష ణ వాతావరణం సృష్టించాడని డీఎస్పీకి వివరించారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తులో ఇవి పునరావృతం అవుతాయని జర్నలిస్టులు డీఎస్పీ కి వివరించారు. లెండుగురే శ్యామ్ రావు పై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని డీఎస్పీ జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యదర్శి తిరుమలాచారితో పాటు జర్నలిస్టులు జె మధుకర్, ఏ. సురేష్, జమీల్, జి . శ్రీనివాస్, చిరంజీవి, షఫీ ఉల్లా, ఇసాక్, బి. కిరణ్, పి. రాజశేఖర్, పి.  సంతోష్, డి. లక్ష్మణ్ , కృష్ణంరాజు గౌడ్, కె. శ్రీకాంత్, ఎం. విష్ణు గౌడ్, బి అనిల్, పి నాగేందర్, కె. అవినాష్, సమీర్,  రాజు, జె. రాజు, పాల్గొన్నారు.