25 February, 2026 | 5:04 AM

కామారెడ్డిలో బోనాల ఊరేగింపు

25-02-2026 01:22 AM

కామారెడ్డి, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్లుగీత పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎల్లమ్మ కళ్యాణోత్సవం ముగిసిన అనంతరం మంగళవారం బోనాల ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. గౌడ కులస్తులు ఇంటికొక బోనం చొప్పున మహిళలు పురుషులు ఆనందంగా బోనాలతో ఊరేగింపు నిర్వహించారు.

కామారెడ్డి లోని విద్యానగర్, అశోక్ నగర్, ఆర్య నగర్, కోర్టు రోడ్డు, హౌసింగ్ బోర్డ్ కాలనీ, వికాస్ నగర్, శ్రీరామ్ నగర్ కాలనీలతో పాటు వివేకానంద కాలనీ లతోపాటు పెద్ద బజార్, పాంచ్ చౌరస్తా, గొల్లవాడ, సరోజీవినీ దేవి రోడ్డు, భారత్ రోడ్ ల నుంచి బోనాలను ఊరేగింపుగా సిరిసిల్ల రోడ్డు, గాంధీ గంజ్,జేపిఎన్ రోడ్ మీదుగా ఎల్లమ్మ ఆలయానికి మహిళలు బోనాలను ఊరేగిస్తూ అమ్మవారి దగ్గరికి తెచ్చి మొక్కులు చెల్లించారు.

కల్లుఘటంతో గీత కార్మికులు నృత్యాలు చేస్తూ అమ్మ దీవించమ్మ ఎల్లమ్మ అంటూ పాటలు పాడుతూ, టపాకాయలు కాల్చుతూ ఎంతో ఉత్సాహంగా బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లో ఉన్న గౌడ బంధువులు, ఇతర ప్రాంతాల్లో ఉన్న బంధువులు ఎల్లమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గీత పారిశ్రామిక సహకార సంఘం ప్రతినిధులు బాలరాజు గౌడ్, బిబిపేట చంద్ర గౌడ్, రవీందర్ గౌడ్, శ్రీధర్ గౌడ్, నారా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.