ఉసురు తగిలింది మీకు.. తగిలేది మీకే..
జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి
కామారెడ్డి, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): ప్రజల ఉసురు తగిలి, మీరు ఎక్కడున్నారో, ఇంకా తగిలేది కూడా మీకేనని బి ఆర్ ఎస్ చేసిన పాపాలకు కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారని జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మన ఊరు మనబడి పథకాన్ని తీసుకువచ్చి కాంట్రాక్టర్లకు డబ్బులు అందించని ఆనాటి మీ ప్రభుత్వం, మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని అబద్ధాలు ఆడిన ప్రజలు గమనిస్తారని హరీష్ రావుకు సూచించారు.
రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి, కాంట్రాక్టర్లకు ఒక రూపాయి ఇవ్వకుండా పనులు చేయించుకున్న ఉసురు మీకే తగులుతుందని పేర్కొన్నారు. సర్పంచ్, మున్సిపాలిటీ ఎన్నికల్లో , మీరు చేసిన పాపాలకు ప్రజల ఉసురు తగిలి మీరు ఎక్కడున్నారో తెలుసుకోవాలని, ఇకనైనా ఫామ్ హౌస్లను వదిలి ప్రజల్లో ఉండాలని, చట్టసభల్లో పాల్గొని ప్రజాపాలనకు సహకరించాలని మోహన్ రెడ్డి సూచించారు.




