16-07-2025 01:04:56 AM
హాజరైన మేయర్ విజయలక్ష్మి
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 15 (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి ప్రతిబిం బించే బోనాల పండుగను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
ఊరేగింపులో భాగంగా కట్ట మైసమ్మ తల్లిని మేయర్ దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడు తూ.. బోనాల పండుగ మన సంస్కృతిని, సమైక్యతను ప్రతిబింబిస్తుందని, మున్సిపల్ ఉద్యోగుల భాగస్వామ్యంతో జరుపుకునే ఈ ఉత్సవం అందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు, అధికారులు, యూనియన్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.