16-07-2025 01:06:25 AM
తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకుల ఆందోళన
కోదాడ జులై 15 : విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మునగాల మండలం కలకోవ గ్రామానికి చెందిన నిమ్మ వెంకటేశ్వర్లు వసుంధర దంపతుల కుమార్తె అయిన తనుషా మహాలక్ష్మి పాఠశాలలో పదవ తరగతి చదువుతుంది. తన తరగతి గదిలో ఫ్యాన్ కురేసుకొని వేలాడుతూ కనిపించడంతో వెంటనే నైట్ వాచ్మెన్ బుచ్చమ్మ అధికారులకు సమాచారం అందించారు.
డీఈవో అశోక్ హుటాహుటి పాఠశాలకు చేరుకొని మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, నడిగూడెం ఎస్త్స్ర జి అజయ్ కుమార్ తో కలసి ఆత్మహత్య గల కారణాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. మృతురాలి తల్లిదండ్రులతో కలిసి ఎస్‌ఎఫ్‌ఐ,పిడీఎస్యూ విద్యార్థి సంఘాలు నాయకులు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆందోళన చేపట్టారు. మృతిదేహాన్ని హుటాహుటిన సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంపై అనేక అనుమానాలు ఉన్నట్లు ఆరోపించారు.