calender_icon.png 16 July, 2025 | 9:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నారాయణ విద్యార్థికి గోల్డ్ మెడల్

16-07-2025 01:03:42 AM

అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్‌లో సందీప్ సత్తా

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 15 (విజయక్రాంతి): ఈ నెల 5 నుంచి 14 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్ నారాయణ కాలేజీ విద్యార్థి కుచ్చి సందీప్ గోల్డ్ మెడల్ సాధించి, భారతదేశ గౌరవాన్ని ఇనుమడింపజేశాడు. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన నలుగురు అధికారిక సభ్యుల్లో సందీప్ ఒకరు.

ప్రపంచం మొత్తం నుంచి వచ్చిన ప్రతిభావంతులైన యువ రసాయన శాస్త్రవేత్తలతో గట్టిపోటీ ఎదుర్కొన్న సందీప్ అసాధారణమైన ప్రజ్ఞ, పాటవాలతో బం గారు పతకాన్ని కైవశం చేసుకున్నాడు. ఈ విజ యం వెనుక నా రాయణ విద్యాసంస్థల అధ్యాప కుల ప్రోత్సాహం, నిరంతర మద్దతు ఉన్నదని ఈ సం దర్భంగా కుచ్చి సందీప్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ పి సింధూర నారాయణ, పి. శరణి నారాయణ మాట్లాడుతూ.. సందీప్ సాధించిన ఈ విజయంతో నారాయణ సంస్థ ఎంతో గర్వి స్తున్నట్లు తెలిపారు. ఇది కేవలం అతని వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, నారాయణ కుటుంబంతో పాటు మొ త్తం భారతదేశం గర్వపడే క్షణమని చెప్పారు.