2 July, 2026 | 3:09 AM

అప్పన్నపేటలో ఘనంగా బోనాలు

02-07-2026 02:03 AM

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే విజయరమణరావు

పెద్దపల్లి, జూలై 1 (విజయక్రాంతి): పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి బోనాల ఉత్సవాలతో పాటు శ్రీ మారేడుగోడ వేణుగోపాల స్వామి కళ్యాణం, రథోత్సవం, నాగవెల్లి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు, స్వామివారి ఆశీస్సులు తీసుకుని రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రైతులకు సమృద్ధిగా పంటలు పండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

బోనమెత్తిన ఎమ్మెల్యే.. 

సుల్తానాబాద్, జులై 1 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కందునూరిపల్లి గ్రామంలో పోచమ్మ బోనాలు బుధవారం ఘనంగా జరిగాయి, ఈ సందర్భంగా విజయ రమణారావు బోనం ఎత్తుకొని ప్రత్యేక పూజలు చేశారు,  ప్రజలందరినీపోచమ్మ తల్లి చల్లంగా చూడాలంటూ ఆ తల్లిని వేడుకోవడం జరిగిందని విజయ రమణారావు అన్నారు, ఈ సందర్భం గా మాజీ ఎంపిటిసి పన్నాల హనుమక్క రాములు , మాజీ సర్పంచ్ పన్నాల తిరుపతి, ఉప సర్పంచ్  మహేష్ తో పాటు పలువురు విజయరమణారావును ఘనంగా సన్మానించారు, ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు...