ఆయిల్ పామ్ సాగు రైతుకు వరం
సాగర్‌లో ఫామ్ అయిల్ ఫ్యాక్టరీ
దామరచర్ల, జులై 1: మండలంలోని వీర్లపాలెం గ్రామంలో ఉద్యాన శాఖ వారి సహకారం తో ‘మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ డ్రైవ్’ లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని బుధవారం పతంజలి కంపెనీ వారు నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా ఉద్యాన శాఖ అధికారి టి. శేఖర్ మాట్లాడుతూ, ‘పామ్ ఆయిల్ పంట తెలంగాణ రైతులకు వరం’ అని అన్నారు.
ప్రతి రైతు కేవలం ఒక్క పామ్ ఆయిల్ మీదనే ఒక ఎకరానికి రూ. లక్ష యాబై వేల నికర ఆదాయం పొందవచ్చని చెప్పారు. అంతర పంటలు వేసినట్లయితే, అదనంగా మరో రూ. 40-50 వేల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చన్నారు. అలాగే పతంజలి కంపెనీ డిజిఎం యాదగిరి మాట్లాడుతూ ‘ప్రతి మండలానికి ఒక ఫీల్ అసిస్టెంట్ ని పెట్టి ఆయిల్ పామ్ పై రైతులకు సాంకేతిక సమాచారాన్ని అందిస్తున్నామని, ఈ యొక్క అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అలాగే నాగార్జున సాగర్ నియోజకవర్గం లోనే పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ పెడుతున్నామని రైతులు ఎవ్వరూ అధైర్య పడొద్దని అన్నారు. మార్చ్ 2027 వరకు ఫ్యాక్టరీ నీ ప్రారంభిస్తాం అని తెలిపారు. నల్లగొండ జిల్లా రైతులు చాలా చైతన్యం గల వారని, భవిష్యత్తులో నల్లగొండ జిల్లాలో లక్ష ఎకరాలల్లో ఆయిల్ పామ్ సాగు అవుతుంది అని, ప్రతి ఒక్క రైతు దీనికి సహకరించాలని విజ్ఞప్తి చేసారు.ఈ సమావేశంలో మిర్యాలగూడ డివిజన్ ఉద్యాన శాఖ అధికారిని నసీమా, పతంజలి జిల్లా మేనేజర్ డా, మధుసూదన్ రెడ్డి గ్రామ సర్పంచ్ శ్రీ నేనావత్ నాగ నాయక్, పతంజలి కంపెనీ ఆఫీసర్స్, రైతులు పాల్గొన్నారు.






