వైభవంగా బోనాల పండుగ
24-08-2026 12:47 AM
ఘట్ కేసర్, ఆగస్టు 23 (విజయక్రాంతి) : బోనాల పండగను ఎదులాబాద్ డివిజన్ పరిధిలోని ఘనాపూర్, అంకుశాపూర్, మా దారం అలాగే పోచారం డివిజన్ పరిధిలోని ప్రతాపసింగారం ప్రాంతాల లోని ప్రజలు ఆదివారం అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఉదయం నుంచి సా యం త్రం వర కు మహిళలు నైవేధ్యంతో కూడిన బోనాల తో శివసత్తుల పూనకాలతో వెంట రాగా కు టుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలసి అ మ్మవారి ఆలయాలకు చేరుకుని సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
ప్రజలు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయాలకు చేరుకోవడంతో భక్తజనులతో ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడాయి. ఈ బోనాల ఉత్సవంలో రాజకీయ నాయకులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.






