సత్తెమ్మతల్లి గుడికి శంకుస్థాపన
24-08-2026 01:58 AM
కూకట్‌పల్లి, ఆగస్టు 23,( విజయ క్రాంతి): కూకట్పల్లి నియోజకవర్గ పరిధి కెపిహెచ్బి కాలనీ మూడవ ఫేజ్ లో నూతనంగా నిర్మించనున్న శ్రీ కలిదిండి సత్తెమ్మ తల్లి దేవా లయం నిర్మాణ కార్యక్రమానికి కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదివారం ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూ జలు నిర్వహించి దేవాలయ నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఆ యన మాట్లాడుతూ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు అనుగుణంగా దేవాలయ నిర్మాణం జరగడం సంతోషకరమన్నారు. శ్రీ సత్తెమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.






