లార్డ్స్ స్కూల్‌లో ఘనంగా బోనాల పండుగ
07-08-2026 12:11 AM
బడంగ్‌పేట్, ఆగస్టు 6 (విజయక్రాంతి): ఆర్.ఎన్.రెడ్డి నగర్లోని లారడ్స్ పాఠశాలలో బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి.విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో, పోతురాజుల విన్యాసాల నడుమ బోనాలతో ఊరేగింపుగా వెళ్ళి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.
తెలంగాణ సంస్కృతిని పిల్లలకు చిన్నతనం నుంచే పరిచయం చేయడం సంతోషకరమని పాఠశాల చైర్మన్ సిద్దాల బీరప్ప, అమ్మవారిని పూజించుకోవడం అదృష్టమని వైస్ చైర్మన్ బెర్లు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ సిద్దాల శ్రీలత, డీన్ సతీష్, ప్రిన్సిపాల్ కిషన్ రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






