‘గోబర్ధన్’కు గ్రీన్‌సిగ్నల్
- జాతీయ సమగ్ర పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం
- కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తికి రూ.23,731 కోట్లు కేటాయింపు
- రూ.8,970.20 కోట్లతో గువాహటి--తేజ్‌పూర్ నాలుగు లేన్ల కారిడార్
న్యూఢిల్లీ, ఆగస్టు 6: దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో రహదారి మౌలిక వసతులను మెరుగుపరిచేలా కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు రూ.23,731 కోట్ల వ్యయంతో ‘గోబర్ధన్’ జాతీయ సమగ్ర పథకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అసోంలో గువాహటి- తేజ్‌పూర్ నాలుగు లేన్ల యాక్సెస్ కంట్రోల్ కారిడార్ అభివృద్ధికి రూ.8,970.20 కోట్ల పెట్టుబడితో కూడిన ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది.
రెండు ప్రాజెక్టుల విలువ కలిపి సుమారు రూ.32,701 కోట్లు. ప్రధానమం త్రి నరేంద్రమోదీ అధ్యక్షతన గురువారం కేంద్ర మంత్రివర్గం సమావేశం జరిగింది. ఈ క్యాబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేస్తూ.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్రమంత్రివర్గ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీవైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. గోబర్ధన్ పథకాన్ని క్యాబినెట్ ఆమోదించిందని తెలిపారు.
‘గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో- అగ్రో రిసోర్సెస్ ధన్’ (గోబర్ధన్) పథకాన్ని జాతీయ స్థాయిలో సమగ్రంగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించిందని పేర్కొన్నారు. ఈ పథకానికి రూ.23,731 కోట్ల ఆర్థిక కేటాయింపు చేయనుందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టును 2026--27 నుంచి 2035--36 వరకు కేంద్రం అమలు చేయనుందని చెప్పారు.
సేంద్రియ వ్యర్థాలు, పశువుల పేడ, వ్యవసాయ అవశేషాలు, వంటగ ది వ్యర్థాలు వంటి బయో వ్యర్థాలను వినియోగించి బయోగ్యాస్, తదుపరి దశలో కం ప్రెస్డ్ బయోగ్యాస్ తయారు చేయడమే దీని ప్రధాన ఉద్దేశమన్నారు. అలాగే అసోం లో నాలుగు లేన్ల నేషనల్ హైవేకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. రూ.8,970 కోట్లతో అసోంలో నేషనల్ హైవే నిర్మించాలని మంత్రులు ఆమోదించారు. అసోంలో జాతీయ రహదారి-15 పరిధిలోని 135.871కిలోమీటర్ల పొడవైన నాలుగు లేన్ల కారిడార్ అభివృద్ధికి ఆమోదం తెలిపింది.
దీన్ని ఎన్‌హెచ్‌ఓ పథకం కింద బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్(బీఓటీ) టోల్ మోడ్‌లో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా తేజ్‌పూర్ బైపాస్‌లో 4.9 కిలోమీటర్ల మేర అత్యవసర ల్యాండింగ్ సౌకర్యాన్ని(ఈఎల్‌ఎఫ్) భారత వైమానికదళం(ఐఏఎఫ్‌తో సమన్వయం చేసుకుని నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టులో భాగంగా బైహాత చరియాలీ, సిఫాఝార్, ఖరుపేటియా, దేకియాజులి, తేజ్‌పూర్ వంటి రద్దీగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ చిక్కులను నివారించడానికి 587 కిలోమీటర్ల మేర 5 ప్రధాన బైపాస్‌లు నిర్మించనున్నారు.
గోవుల పేడతో ఇంధన ఉత్పత్తి
దేశీయ సీబీజీ ఉత్పత్తిని ప్రస్తుత స్థాయి తో పోలిస్తే దాదాపు పది రెట్లు పెంచడం ద్వారా దిగుమతి చేసుకునే సహజ వా యువుపై ఆధారపడటాన్ని తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్రమంత్రి అశ్వినీవైష్ణవ్ స్పష్టం చేశారు. ఇం దులో భా గంగానే దేశంలో సమృద్ధిగా ల భించే వ్యవసాయ వ్యర్థాలు, పశువుల పే డ, ప్రెస్ ముద్, పురపాలక సేంద్రీయ వ్య ర్థాలను పరిశుభ్రమైన ఇంధనంగా, సేం ద్రీయ ఎరువులుగా మార్చడమే ఈ పథ కం లక్ష్యమని తెలిపారు.
భారత వ్యర్థాలే దేశాభివృద్ధికి ఇంధనం.. గ్రామాలే స్వచ్ఛ ఇంధన ఉత్పత్తి కేంద్రాలు.. రైతులే ఇంధన భద్రతలో భాగస్వాములు” అనే దూరదృష్టితో కేంద్రప్రభుత్వం ‘గోబర్ధన్’ పథకాన్ని అమలు చేస్తోంది. దీంతో వ్యర్థాల నిర్వహణతో పాటు ప్రత్యామ్నాయ ఇంధన ఉత్ప త్తి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, రైతుల ఆదా యం, ఉపాధి అవకాశాలకు ఊతం లభించనుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
గోబర్ ధన్ పథకం 2018లో స్వచ్ఛ భార త్ మిషన్ (గ్రామీణ)లో భాగంగా ప్రారంభమైంది. బ యో వ్యర్థాలను బయోగ్యాస్, బయో-స్లర్రీగా మార్చడం ద్వారా గ్రామా ల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పా టు వ్యర్థాలను విలువైన వనరుగా మార్చ డం దీని ప్రాథమిక లక్ష్యం. 2026 జనవరి 27 నాటికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాం తాలు నివేదించిన వివరాల ప్రకారం.. దేశంలో పలు సీబీజీ ప్రాజెక్టులు ఇప్పటికే పనిచేస్తున్నాయి.






