7 August, 2026 | 1:13 AM

మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్

07-08-2026 12:09 AM

ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉధ్యమానికి స్పూర్తినిచ్చిన మహానీయుడు ప్రొఫెసర్ జయంశంకర్ అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ కొనియాడారు.  గురువారం తెలంగాణ ఉధ్యమ సారధి ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి కార్యక్రమాన్ని బాపూజీనగర్ లో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు టి. సోమన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ నీళ్లు, నిధులు ఉద్యోగాలలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని లెక్కలతో సహా బయటపెట్టి తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ డివిజన్ బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు డి. శివముదిరాజ్, దీన్  దయాల్ రెడ్డి, టెంట్ హౌస్ శ్రీనివాస్ డివిజన్ ఉపాధ్యక్షుడు మోహిన్, డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సదా తదితరులు పాల్గొన్నారు. 

సిద్దాంతకర్తగా నిలిచిన జయశంకర్ సార్..

ముషీరాబాద్‌లో జరిగిన కార్యక్రమానికి బీఆర్‌ఎస్ నాయకుడు ముఠా జైసింహ హాజరై జయంశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రొఫెసర్ జయశంకర్ జీవితాన్ని రాష్ట్ర సాధన కోసం కేటాయించారని అన్నారు. ఆయన జీవిత చరిత్రను పత్రిక రూపంలో ముద్రించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సోమన్, శ్రీనివాస్, సుధాకర్ గుప్తా, బిక్షపతి యాదవ్, బాలరాజు గౌడ్, శ్రీనివాస్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.