7 August, 2026 | 1:45 AM

తేజ్‌పాల్‌కు 10ఏళ్ల జైలుశిక్ష

07-08-2026 12:34 AM
  1. రూ.10లక్షల జరిమానా
  2.   4 వారాల్లో లొంగిపోవాలి
  3. సహోద్యోగిణిపై లైంగికదాడి కేసులో జర్నలిస్ట్ తరుణ్ తేజ్‌పాల్‌ను దోషిగా తేల్చిన బాంబే హైకోర్టు 
  4. ట్రయల్ కోర్టు తీర్పును రద్దు చేసిన ధర్మాసనం

పనాజీ, ఆగస్టు 6: సహోద్యోగిణిపై లైంగికదాడి కేసులో జర్నలిస్ట్ తరుణ్ తేజ్‌పాల్‌ను దోషిగా తేల్చి, పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ బాంబే హైకోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. రూ.10లక్షల జరిమానా కూడా వేసింది. అంతేకాదు అతను నాలుగు వారాల్లోగా లొంగిపో వాలని ఆదేశించింది. 13ఏళ్ల నాటి లైంగికదాడడి కేసులో తరుణ్ తేజ్‌పాల్‌కు లభించిన నిర్దోషిత్వాన్ని బాంబే హైకో ర్టు రద్దు చేసింది.

ప్రాసిక్యూషన్ తన కేసును సహేతుకమైన సందేహానికి అతీతంగా నిరూపించినప్పటికీ, ట్రయల్ కోర్టు తీర్పులు ‘విపరీతమైనవి’, ‘ఆమోద యోగ్యం కానివి’ అని స్పష్టం చేసింది. సాక్ష్యాలను అసమంజసంగా అంచనా వేయడంపై ఆధారపడిన వని హైకోర్టు తేల్చిచెప్పింది. తమ 81 పేజీల తీర్పులో, జస్టిస్‌లు నీలా గోఖలే, అమిత్ జమ్‌సందేకర్‌తో కూడిన ధర్మాసనం, బాధితురాలిని నిందితుల బోనులో నిలబెట్టి, ఆమె వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించిన తీరును తీవ్రంగా తప్పుబట్టింది.

అంతేకాకుం డా, ‘క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో ఆమె ను వేధించడా నికి, అవమానించడానికి డిఫెన్స్‌కు ట్రయల్ కోర్టు అనుమతి ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది’ అని స్పష్టం చేసింది. బా ధితురాలు నిజమైన వాంగ్మూలాలు ఇచ్చిందని, ప్రాసిక్యూషన్ తమ కేసును ‘ప్రతి సహే తుకమైన సందేహానికి అతీతంగా’ నిరూపించిందని తేల్చిచెప్పింది. 2013లో జూనియర్ సహోద్యోగిణిపై లైంగికదాడి చేసిన కేసులో తేజ్‌పాల్‌ను బాంబే హైకోర్టు గోవా బెంచ్ దోషిగా తేల్చింది.

2013లో గోవాలో జరిగిన థింక్ ఫెస్ట్ ఈవెంట్‌లో పాల్గొన్న సమయంలో హోటల్ ఎలివేటర్‌లో తేజ్‌పాల్ తనపై లైంగిక దాడికి పాల్పిడినట్లు బాధితు రాలు ఆరోపించారు. దీంతో అదే ఏడాది న వంబర్‌లో అతడిని అరెస్ట్ చేయగా, ఆ తర్వా త బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ కేసులో 2017 లో మాపులా ట్రయ్ కోర్టులో విచారణ ప్రారంభమైంది. తేజ్‌పాల్‌ను నిర్దోషిగా తేలుస్తూ 2021లో న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దానిని గోవా ప్రభుత్వం హైకోర్టులో సవాలు చేసింది.

ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలనువినిపించారు. ట్రయల్ కోర్టు వాదన ను ‘విపరీతమైనది’, ‘ఆమోదయోగ్యం కాని ది’ రికార్డులోని సాక్ష్యాధారాలకు విరుద్ధమైనదిగా పేర్కొంటూ, బాంబే హైకోర్టు తరుణ్ తేజ్‌పాల్ నిర్దోషిత్వాన్ని పాయింట్ వారీగా ఖండించింది. తీవ్రమైన న్యాయ వైఫల్యానికి దారితీసిన అనేక చట్టపరమైన, వాస్తవపర మైన లోపాలను ఎత్తిచూపింది. 

న్యాయ సూత్రాలను ట్రయల్ కోర్టు విస్మరణ

లైంగిక దాడి కేసుల మూల్యాంకనా న్ని నియంత్రించే సుప్రీం కోర్టు స్థిర సూ త్రాలను ట్రయల్ కోర్టులో విస్మరించారని బాంబే హైకోర్టు వెల్లడించింది. లైం గిక దాడి అనే తీవ్రమైన మానసిక క్షోభ ను ఇప్పటికే ఎదుర్కొన్న బాధితురాలు, క్రాస్-ఎగ్జామినేషన్ సమయంలో సిగ్గు, ఆందోళన లేదా గందరగోళానికి గుర య్యే అవకాశం ఉందనే వాస్తవాన్ని ట్ర యల్ కోర్టు విస్మరించిందని పేర్కొంది.

నేరం జరిగిన తర్వాత ఆమె తన మానసిక క్షోభను ఎలా ఎదుర్కోవాలో లేదా దాని నుంచి ఎలా బయటపడాలో విచారణ కోర్టు గానీ, నిందితుడు గానీ నిర్ణ యించలేకపోయారని న్యాయమూర్తు లు అన్నారు. ఈ కేసులో గోవా సెషన్స్ కోర్టు 2021లో ఇచ్చిన నిర్దోషి తీర్పును హైకోర్టు రద్దుచేసింది. తేజ్‌పాల్‌ను దోషి గా నిర్ధారించి, అతనికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 10లక్షల జరిమానా విధించింది. నాలుగువారాల లోపు లొంగిపోవాలని ఆదేశించింది.