10 August, 2026 | 1:55 AM

పారమిత హెరిటేజ్ పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ

10-08-2026 12:32 AM

ముకరంపుర, ఆగస్టు 9 (విజయక్రాంతి): నగరంలోని పద్మనగర్ పారమిత హెరిటేజ్ పాఠశాలలో ఆషాడ మాస బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఉత్సవాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.హన్మంత రావు అమ్మవారికి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

విద్యార్థులు స్వయంగా బోనాలు ఎత్తుకుని పులివేశాలు, పోతురాజుల వేషాలు ధరించి డప్పు చప్పుల్ల కొలహాలంతో సందడి చేస్తూ అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పారమిత విద్యాసంస్థల డైరెక్టర్లు రశ్మిత, వినోదరావు, వి. యు.ఎం. ప్రసాద్, హనుమంతరావు, ప్రధానోపాధ్యాయులు హెడ్ గోపీకృష్ణ, సమన్వయకర్తలు రబీంద్ర పాత్రో, భవాని, నిఖిత, సాంస్కృతిక సమన్వయకర్త సుష్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.