10 August, 2026 | 1:42 AM

ఎంపీ చామలను కలిసిన కాంగ్రెస్ నాయకులు

10-08-2026 12:33 AM

అబ్దుల్లాపూర్ మెట్, ఆగస్టు 9: భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డిని పెద్ద అంబర్ పేట్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. టీపీసీ సీ మీడియా & పబ్లిసిటీ కమిటీ చైర్మన్ గా నియమితులైన శుభ సందర్భంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్దెంకి కృష్ణా రెడ్డి, యూత్ కాంగ్రెస్ పాలడుగు నాగార్జున్ తదతరులు పాల్గొన్నారు.