21-07-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, జూలై 20 (విజయ క్రాంతి): తెలంగాణ జీవన విధానం, సంస్కృతి సాంప్రదాయాలకు బోనాలు ప్రతీకగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఆదివారం కోతిరాంపూర్ లోని పోచమ్మ దేవాలయంలో అమ్మవారికి జిల్లా కలెక్టర్ బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో బోనాలు ఆత్మ గౌరవానికి, ఐక్యతకు, సమిష్టికి, ఘనమైన చరిత్రకు నిదర్శనమని అన్నారు. ప్రతి ఇంటిలోనూ బోనాల సంబరాలు ఘ నంగా జరుపుకుంటారని అన్నారు. తెలంగాణ జీవన విధానం ఎంతగానో ఆకట్టుకుంటుందని తెలిపారు.
జిల్లా ప్రజలందరి పైనా అమ్మవారి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు. ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నానని అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం శుభ పరిణామమనిపేర్కొన్నారు.