calender_icon.png 21 July, 2025 | 7:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హస్తంలో అధ్యక్ష పదవుల కోసం భారీగా దరఖాస్తులు

21-07-2025 12:00:00 AM

- మండల, మున్సిపల్ అధ్యక్ష పదవులకు నామినేషన్లు

- యాచారం మండలంలో ఏకంగా 58 అప్లికేషన్స్

- స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని పదవుల పంపకం 

తుర్కయంజాల్, జులై 20: హస్తం పా ర్టీలో అధ్యక్ష పదవులపై తీవ్ర పోటీ నెలకొం ది.పార్టీ అధికారంలోకి రాగానే కొత్త కార్యవర్గాలు రూపుదిద్దుకుంటాయని తొలుతా భా వించినా ఆ దిశగా పార్టీ అడుగులు వేయలేదు.

స్థానిక సంస్థలు సమీపిస్తున్న తరుణం లో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం అడుగులు వేస్తూ పార్టీ అధ్యక్ష ఎంపికల పై తీవ్ర కసరత్తులు ప్రారంభించింది. ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉం డడంతో గ్రామస్థాయి మొదలు కొని తాలూ కా స్థాయి వరకు పార్టీ పదవులపై తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే గ్రామస్థాయి నుంచి మండల పట్టణ మున్సిపాలిటీ వరకు పార్టీ పదవుల కోసం దరఖాస్తులు ఆశావావుల నుంచి భారీగా స్వీకరించారు.

 కాంగ్రెస్కు కంచుకోట ఇబ్రహీంపట్నం..

 ఆది నుంచి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ కు తిరుగులేని శక్తిగా ఉంది. 15ఏళ్లు అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ కేడర్ చెక్కుచెదరలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే మ ల్రెడ్డి రంగారెడ్డి మార్గదర్శకంలో, ఆయన్నే నమ్ముకొని కార్యకర్తలంతా ఏకతాటిపై ఉన్నా రు.

కార్యకర్తల్లో భరోసా నింపుతూ పదిహేనే ళ్లు పార్టీని ఒంటి చేత్తో నిలబెట్టారు. కార్యకర్తలు కూడా అంతే నిష్ఠతో ఉన్నారు. ఇప్పుడు ఇబ్రహీంపట్నంతో పాటు రాష్ట్రంలోనూ అ ధికారంలో హస్తం పార్టీ ఉండటంతో పార్టీ పదవుల కోసం కార్యకర్తలు తాపత్రయపడుతున్నారు. ఇన్నాళ్లు పడిన కష్టానికి పార్టీ పదవి రూపంలో ఫలితం వస్తుందన్న ఆశాభావంతో పార్టీని అట్టిపెట్టుకొని ఉన్నారు.

 నాలుగు మండలాలు

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నా లుగు మండలాలు (ఇబ్రహీంపట్నం, యా చారం, మంచాల, అబ్దుల్లాపూర్మెట్), నాలు గు మున్సిపాలిటీలు (ఇబ్రహీంపట్నం, తుర్కయంజాల్, పెద్ద అంబర్ పేట, ఆదిభట్ల) ఉ న్నాయి. ఆయా మండలాలు, మున్సిపాలిటీల లో పార్టీ పదవుల కోసం నేతలు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నారు. ముఖ్యంగా యాచారం మండలంలో పార్టీ పదవుల కోసం పోటీ తీవ్రత ఎక్కువగా ఉంది.

యాచారం మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎక్కడా లేని డిమాండ్ ఉన్నట్లు తెలు స్తోంది. ఇక్కడ ఏకంగా 58 నామినేషన్లు వచ్చాయి. ప్రస్తుత అధ్యక్షుడు మస్కు నర్సిం హ, కొడవగంటి శ్రీనివాసరెడ్డి మధ్య పోటీ ఉంది. మేడిపల్లికి చెందిన మోటె శ్రీశైలం, మంతన్ గౌరెల్లి వాసి అరవింద్ నాయక్ కూ డా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు.

అయితే కష్టకాలంలో పార్టీని ఏకతాటిపై నడిపిన మ స్కు నర్సింహ వైపే అధిష్ఠానం మొగ్గు చూపవచ్చని వినికిడి. కాకపోతే ఇటీవలే మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఆయన నియమితులయ్యా రు. రెండు పదవుల అంశం తెరపైకి వస్తే... శ్రీనివాసరెడ్డికి అధ్యక్ష పదవి వరించే ఛాన్స్ ఉంది. సామాజిక సమీకరణాలు తమకు ఉపయుక్తంగా మారవచ్చని శ్రీశైలం, అరవింద్ నాయక్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. 

 ఇబ్రహీంపట్నం మండలంలో..

మండల అధ్యక్ష పదవి పై జడల రవీందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరు రమే ష్లు పదవిని ఆశిస్తున్నారు.బీసీ వర్గానికి చెం దిన కోడూరు రమేష్ గత కొంత కాలం గా పార్టీ ని నమ్ముకొని ఉన్నారు. సామాజిక స మీకరణాలతో రమేష్కు అధ్యక్ష పదవి దక్కొచ్చని భావిస్తున్నారు. రాజకీయ అనుభవం, ఆర్థిక, అంగబలం ఉన్న రవీందర్రెడ్డి వైపు పా ర్టీ చూస్తుండవచ్చని కొందరు భావిస్తున్నా రు. నియోజకవర్గ కేంద్రం కావడంతో అధ్యక్ష పదవి కోసం రాష్ట్ర స్థాయిలో సంప్రదింపులు నడుస్తున్నాయన్నది ఇక్కడున్న టాక్.

మంచాల మండలంలో..

 ఇద్దరు బీసీ నేతల మధ్యే పోటీ నెలకొంది. చిత్తాపూర్ మాజీ సర్పంచ్ జిలమోని సత్తయ్య, చెన్నారెడ్డిగూడెం సీనియర్ నాయకుడు చీమల జంగయ్య మధ్య అధ్యక్ష పదవి ఊగిసలాడుతోందని చెబుతున్నారు. సౌ మ్యుడిగా పేరున్న జిలమోని సత్తయ్య మం డల వ్యాప్తంగా అందరికీ సుపరిచితుడు.

ఎ న్నాళ్లుగానో పార్టీని నమ్ముకొని ఉన్నారు. సర్పంచ్గా మండలంలో మంచి పేరు తెచ్చుకున్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉం టారన్నన పేరుంది. ఇక సీనియర్ నాయకుడు చీమల జంగయ్య ప్రెసిడెంట్ పదవి కో సం ఆశగా ఎదురుచూస్తున్నారు. పై నాయకులతో ఆయనకున్న పరిచయాలు అధ్యక్ష పదవి వరించేలా చేస్తాయని భావిస్తున్నారు. 

 అబ్దుల్లాపూర్మెట్ మండలంలో..

 ప్రస్తుత అధ్యక్షుడు, బండరావిరాల గ్రా మానికి చెందిన సీనియర్ నాయకుడు కొత్త ప్రభాకర్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి అనుచరుడిగా గుర్తింపు ఉన్న ప్రభాకర్ గౌడ్కు పదవి మళ్లీ దక్కవచ్చవనే ఊహాగానాలున్నాయి. మరోవైపు అబ్దుల్లాపూర్మెట్ సీనియర్ నా యకుడు, మాజీ ఎంపీపీ భర్త బూర మహేందర్ గౌడ్ అధ్యక్ష పదవిలో ముందంజలో ఉ న్నట్లు తెలుస్తోంది.

అన్ని కార్యక్రమాల్లో చు రుగ్గా పాల్గొనే మహేందర్ గౌడ్కు మండల వ్యాప్తంగా కార్యకర్తల మద్దతు ఉంది. వీరే కాకుండా బండరావిరాల మాజీ సర్పంచ్ కవాడి శ్రీనివాసరెడ్డి, మూల మహేష్ గౌడ్, గుంతపల్లి మాజీ సర్పంచ్ వెంకటేశ్, ఇనాంగూడ మాజీ సర్పంచ్ ఊషయ్యగౌడ్ తమకే పదవి లభిస్తుందన్న ఆశతో ఉన్నారు. 

తుర్కయంజాల్ పురపాలికలో..

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ ఉం ది. ముఖ్యంగా ముగ్గురి పేర్లు బాగా వినబడుతున్నాయి. బీసీ సామాజికవర్గానికి చెంది న కొశికె ఐలయ్య పేరు ఇక్కడ ముందంజలో ఉంది. బ్రాహ్మణపల్లికి చెందిన సీని యర్ నాయకుడు, అందరికీ ఆప్తుడిగా ఉన్న కొంతం వెంకటరెడ్డి (జానీ)కి పేరు ఎప్పటి నుంచో అందరి నోళ్లలో నానుతోంది.

ఇక రాగన్నగూడకు చెందిన సీనియర్ పొలిటిషియన్ సామ భీంరెడ్డి కూడా పదవిని ఆశి స్తున్నారు. అయితే, గతంలో ఇక్కడ అధ్యక్షురాలిగా ఉన్న వ్యక్తి బీసీ కావడం, మళ్లీ బీసీల కే అవకాశం ఇవ్వాలన్న ఆలోచన ఉంటే కొ శికె ఐలయ్యకు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఎమ్మెల్యే రంగారెడ్డి, రాంరెడ్డి సన్నిహితుడిగా ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశం. ఐల య్య, జానీ మధ్యే ఎవరో ఒకరికి పార్టీ పగ్గా లు అప్పజెప్పే అవకాశంఉందనితెలుస్తోంది.

 పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ

 స్థానికుడు గంట శ్రీనివాసరెడ్డి, మాజీ కౌన్సిలర్ గ్యారల శ్రీను పదవిని ఆశిస్తున్నారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేశా రు. వీరు కాకుండా యూత్ కాంగ్రెస్ నుంచి చామల అనుకిరణ్ రెడ్డి అధ్యక్ష పదవి తనకే కావాలని కోరుతున్నారు. 

ఆదిభట్ల మున్సిపాలిటీలోనూ..

ప్రస్తుత అధ్యక్షుడు, పటేల్ గూడ వాస్తవ్యుడు బాలరాజు గౌడ్కే మళ్లీ పగ్గాలిచ్చే ఛా న్స్ ఉంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీపై నేతలు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని తె లుస్తోంది. మున్సిపల్ మాజీ చైర్మన్ భర్త చం దుకు పార్టీ బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉంది.ఏదేమైనా, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్లో భిన్న పరిస్థితులు నెలకొన్నా యి.

మండల, మున్సిపల్ అధ్యక్ష పదవుల రేసులో ఒక్కరంటే ఒక్కరు మహిళలు లేకపోవడం కాస్త విస్మయానికి గురిచేస్తోంది. ప్రస్తు తం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తెరపైకి రావడం, అందులో మహిళల కూడా 33 శా తం అవకాశాలు ఉంటాయని ఇప్పటికే సీ ఎం ప్రకటించడం గమనార్హం.

అయితే పార్టీ ప దంలో మహిళలు కూడా స్థానం కల్పిస్తారా? కొత్తవారికి అవకాశం ఇస్తారా? మళ్లీ పాత వారికి కొనసాగిస్తారా? ఇలా రకరకాల ఊహాగానాలు అయితే ప్రస్తుతం చక్కర్లు కొ డుతున్నాయి. కాంగ్రెస్ అంటేనే సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుందని అయితే అందరం భావిస్తుంటారు. ఆ దిశగానే పార్టీ అధిష్టానం అడుగులు వేస్తుందని భావిద్దాం.