21-07-2025 12:00:00 AM
జగిత్యాల అర్బన్, జులై 20(విజయ క్రాంతి):వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా మహిళలకు, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్ర ముఖ స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ జయంతి అన్నారు.
వాల్మీకి ఆవాసం ద్వారా నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం, ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం ద్వారా శిక్షణ పొందిన 150 మంది శిక్షార్తులకు ఆదివారం వాల్మీకి ఆవాసంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ జయంతి మాట్లాడుతూ గత 32 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసం ద్వారా ఎంతో మంది నిరుపేద విద్యార్థులు వివిధ హోదాల్లో స్థిరపడడం ఆనందదాయకం అన్నారు.
మహిళల కోసం ఉచిత కుట్టు శిక్షణ, కంప్యూటర్ శిక్షణను అందజేసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా ఆర్థిక స్వావలంబన కలిగించే దిశగా ఆవాస నిర్వాహకులు అడుగులు వేయడం అభినందనీయమన్నా రు.
ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాతిని శంకర్, సేవా భారతి అధ్యక్షులు ఎస్పీ సుబ్రహ్మణ్యం, విభాగ్ సేవ ప్రముఖ ఆకు రాజేందర్, కట్ట చంద్రశేఖర్, తహసిల్దార్ రాజ మనోహర్ రెడ్డి, రవీందర్ రాజు, ఆవాస కార్యదర్శి మదన్ మోహన్ రావు, ఆవాస క మిటీ సభ్యులు అశోక్ రావు, సంపూర్ణ చారి, హరీష్, మధుకర్, వెంకటేశ్వరరావు,సత్యం జీ, మల్లేశం తదితరులుపాల్గొన్నారు.