జూలై 7 నుంచి నగరంలో బోనాలు
15-06-2024 12:06 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 14 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో జూలై 7వ తేదీ నుంచి బోనాలు ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో మహంకాళి అమ్మవారికి ప్రజలు మొక్కు లు చెల్లించడం ఆనవాయితీ. గోల్కొండలోని జగదాంబిక గుడిలో మొదలై సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ సింహవాహిని దేవాలయంలో ఈ బోనాల వేడుకలు ముగుస్తాయి. ప్రజలు ఈ బోనాల పండుగను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.






