23 August, 2026 | 11:30 PM

సన్నవడ్లతో బోనస్ మొదలు

22-05-2024 01:34 AM

తడిసిన, మొలకెత్తిన ధాన్యానికీ ఎంఎస్‌పీ 

చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం 

ధాన్యం కొనుగోళ్లపై బీఆర్‌ఎస్ అబద్ధాలు 

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

రైతులతో విపక్షాలు రాజకీయం చేయడం మానుకోవాలి. వరి వేస్తే ఉరే అన్న మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను గుర్తుంచుకోవాలి. కేసీఆర్ హయాంలో కంటే ఈసారి ఎక్కువగా ౨౧౪  ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. అన్నదాతలెవరూ ఆధైర్యపడొద్దు.

 డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీఆర్‌ఎస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రభుత్వం సన్న వడ్లకే రూ.5౦౦ బోనస్ ఇస్తుందని రైతుల్లో గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. బోనస్ సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పలేదని, సన్న వడ్లతో ఈ పథకాన్ని ప్రారం భిస్తున్నామని వివరించారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మీడి యాతో మాట్లాడుతూ.. రైతులతో రాజకీయం చేయడం మానుకోవాలని విప క్షాలకు హితవు పలికారు.

వరి వేస్తే ఉరే అన్న మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను గుర్తుంచుకోవాలని చురకలంటించారు. కేసీఆర్ హయాంలో కంటే ఈసారి ౨౧౪ ఎక్కువ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో కొనుగోలు చేసిన వరిధాన్యం కంటే ఇప్పుడు ఎక్కువగా కొంటున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై బీఆర్‌ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదని హితవు పలికారు. అకాల వర్షాలతో తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కనీస మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనలేదని గుర్తుచేశారు. 

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూస్తామని, చివరి గింజవరకు కొంటామని హామీ ఇచ్చారు. ధాన్యం సేకరించిన మూడు రోజుల్లోనే రైతుల ఖాతాలో నగదు జమ చేస్తున్నామని భట్టి తెలిపారు. అన్నదాతలెవరూ ఆధైర్యపడొద్దని సూచించారు. రైతు అనుకూల నిర్ణయాలు ప్రతిపక్షాలకు మింగుడు పడటం లేదని, అన్నదాతల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెరగడంతో అక్కసు వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. ప్రజా అవసరాలు తీర్చడంలో రాజీవ్‌గాంధీ చూపిన మార్గాన్ని తమ ప్రభుత్వం అనుసరిస్తోందని తెలిపారు.