రోజంతా కొన్న ధాన్యం 75 వేల టన్నులే
ఇంకా సేకరించాల్సింది 36 లక్షల టన్నులు
ఈ లెక్కన మొత్తం కొనేందుకు మరో 50 రోజులు
రైతన్నలను తరుముకొస్తున్న వానకాలం
అకాల వర్షాలతో తడుస్తున్న ధాన్యం
కొనుగోళ్ల నత్తనడకపై అన్నదాతలు ఆగ్రహం
హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి): ఒకవైపు అకాల వర్షాలతో కల్లా ల్లోని ధాన్యం తడిసి మొలకెత్తుతున్నా కొనుగోళ్లు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. మంగళవారం రోజంతా రాష్ట్రం మొత్తంలో జరిగిన కొనుగోళ్లు ౭౫ వేల టన్నులు మాత్రమే. ఇది ప్రభుత్వం చెప్పిన లెక్కనే. ఒకవైపు వర్షాకాలం తరుముకొస్తుండటం, ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి వారాలకు వారా లు గడిచిపోవటంతో అన్నదాల కంటి మీద కునుకు లేకుండా పోయింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచామని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మా త్రం అది కనిపించటంలేదు.
ఈ రాష్ట్రవ్యాప్తంగా ఇంకా కొనుగోలు చేయా ల్సిన ధాన్యం ౩౮ లక్షల టన్నులు ఉంటుందని అంచనా. ఈ లెక్కన మొత్తం ధాన్యం కొనుగోలు చేయటానికి ఇంకా 50 రోజులు పడుతుంది. అప్పటివరకు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచితే చేతికొచ్చేది ఏమీ ఉండదని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పంట పండించిన కాలంలో సగం రోజులు ఆ పంటను అమ్ముకోవటానికే కష్టపడాల్సి వస్తే ఎలా అని నిలదీస్తున్నారు. 15 రోజుల్లో మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మంత్రులు ప్రకటన లు చేస్తున్నారు.
రోజుకు ౭౫ వేల టన్నులు కొంటే ఇది ఎలా సాధ్యమని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభు త్వం ఏప్రిల్‌లో కొనుగోళ్లు ప్రారంభించింది. ఇప్పటివరకు 37 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసిం ది. మొత్తం కొనుగోళ్ల టార్గెట్ 75 లక్ష ల టన్నులుగా నిర్ణయిచింది. ఆ లెక్కన ఇంకా 38 లక్షల టన్నులు సేకరించాల్సి ఉన్నది. ప్రారంభంలో రోజుకు లక్ష టన్నుల కొనుగోలు చేసిన పౌరసరఫరాల శాఖ.. మంగళవారం 75 వేల టన్నులే కొనుగోలు చేసింది.






