19-12-2025 10:34:13 AM
హైదరాబాద్: ఎన్టీఆర్ స్టేడియంలో(NTR stadium) శుక్రవారం నుంచి ఈ నెల 29 వరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్(Hyderabad Book Fair) జరగనుంది. ప్రదర్శన ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) హాజరు కానున్నారు. ప్రారంభోత్సవ సభలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం పాల్గొనున్నారు. రచయితల కలయిక వేదికగా 38వ హైదరాబాద్ పుస్తక మహోత్సవం నిర్వహిస్తున్నారు. సుమారు 10-15 లక్షల మంది పుస్తక ప్రియులు సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నెల 24న లోయర్ ట్యాంక్ బండ్ అమ్మవారి ఆలయం నుంచి బుక్ వాక్ కొనసాగనుంది. ప్రదర్శన సందర్భంగా 'పుస్తక స్ఫూర్తి పైలాన్' అనే 8 అడుగుల స్తూపం ఏర్పాటు చేయనున్నారు. మొత్తం ప్రాంగణానికి ప్రజా కవి అందెశ్రీ(Ande Sri) ప్రాంగణంగా నామకరణం చేశారు.