calender_icon.png 19 December, 2025 | 11:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు కోర్టుకు కాకర్ల శ్రీనివాస్

19-12-2025 10:07:12 AM

హైదరాబాద్: జయత్రి ఇన్ ఫ్రా స్ట్రక్చర్(Jayatri Infrastructure) ఎండీ కాకర్ల శ్రీనివాస్(Kakarla Srinivas)ను నేడు కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. జయత్రి ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ కేసులో(Jayatri Infrastructure case)  పరారీలో ఉన్న కాకర్ల శ్రీనివాస్ ను నిన్న  చెన్నైలో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కాకర్లను ఈడీ అధికారులు(ED officials) కోర్టులో హాజరుపర్చనున్నారు. ఫ్రీలాంచ్ ఆఫర్ పేరుతో కాకర్ల శ్రీనివాస్ రూ. 60 కోట్లకు పైగా వసూళ్లు చేశాడు. సీసీఎస్ లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ అధికారులు మరో కేసు నమోదు చేశారు. నవంబర్ లో హైదరాబాద్ లోని 8 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. జయత్రి ఇన్ ఫ్రాస్ట్రక్చర్, అనుబంధ సంస్థల్లో ఈడీ సోదాలు చేసింది. పలు పత్రాలు స్వాధీనం, కంపెనీ బ్యాంకు ఖాతాలను ఈడీ ఫ్రీజ్ చేసింది.