4 May, 2026 | 2:53 AM

సర్కార్ బడుల్లో పుస్తక పఠనం

22-08-2025 12:00 AM

డాక్టర్ విజయభాస్కర్ :

చదవడం అనేది మనసుకు వ్యాయామం. ఇది పిల్లలు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి సహా యపడుతుంది. వారి మనస్సులను ప్రకాశవంతం చేయడానికి కొత్త జ్ఞానపు తలు పులు తెరుస్తుంది. చదవడం వల్ల పదజాలం మెరుగుపడుతుంది. 

తెలంగాణ రాష్ర్టంలోని ప్రభుత్వ, పంచాయతీరాజ్ బడుల్లో ‘రీడిం గ్ క్యాంపెయిన్’ విద్యార్థుల్లో పుస్తక పఠన శక్తిని పెంపొందించనుంది. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం, తెలంగాణ రాష్ర్ట విద్యా శాఖ, తెలంగాణ రాష్ర్ట విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థుల్లో పుస్తక పఠనం శక్తిని పెంచడానికి ఆగస్ట్టు 20 నుంచి జాతీయ అక్షరాస్యత దినోత్సవమైన సెప్టెంబర్ 5 వరకు ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయులకు బాధ్యత అప్పగించారు.

సెల్‌ఫోన్‌లు వచ్చిన తర్వా త పుస్తక పఠనం తగ్గిపోయిందని.. ‘బుక్ కల్చర్ పోయి లుక్ కల్చర్’ వచ్చిందంటూ అనేక మంది విద్యావేత్తలు, ఉపాధ్యాయు లు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు సెల్ ఫోన్‌లకు పూర్తిగా బానిసలుగా మారుతున్నారు. మొబైల్ ఫోన్లే ప్రపంచంగా ఊహల్లో జీవిస్తూ పుస్తకాలపై దృష్టిని కేంద్రీకరించడం లేదు.

మహమ్మారి కరోనా వైరస్ వల్ల ప్రభుత్వ, పంచాయతీరాజ్, ప్రైవేటు పాఠశాలలు, విద్యా సంస్థలు మూతపడటం.. ఆన్ లైన్ లో విద్యా బోధన ప్రారంభమైంది. అయి తే కరోనా తర్వాత పాఠశాలలు, విద్యా సంస్థలు తిరిగి ప్రారంభమైనా పిల్లలు సెల్ ఫోన్ వాడటం మాత్రం మర్చిపోవడం లేదు.

ప్రత్యేక శిక్షణ తరగతులు..

పాఠశాల విద్యార్థులు మొబైల్ వ్యసనా న్ని వదిలి పుస్తక పఠనంపై దృష్టి సారించేలా తెలంగాణ రాష్ర్ట విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో వేసవి సెలవుల్లో తెలంగాణ రాష్ర్టంలోని అన్ని ప్రభుత్వ, పంచాయతీ రాజ్, గురుకుల, ఆదర్శ పాఠశాలలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య ను అందించడానికి, విద్యార్థుల్లో పఠన శక్తిని పెంచడానికి, అభ్యసన ఫలితాలు సాధించడానికి, విషయ పరిజ్ఞానం పెం పొందించడానికి శిక్షణ ఇవ్వడం జరిగింది.

విద్యార్థులందరికి చదవడం, రాయడం, నేర్పించేలా శిక్షణ అందించారు. అర్థం చేసుకున్నది వ్యక్తీకరించడం వల్ల విద్యార్థుల్లో ఉపాధ్యాయులు ఆశించిన అభ్యసన ఫలితాలు సాధించడానికి అవకాశం ఉం టుంది. విద్యార్థులు నేర్చుకున్న విషయాలను తమ నిత్య జీవితంలో ఉపయోగపడే విషయాలకు వర్తింపజేయడం వల్ల విద్యాశాఖ ముఖ్యంగా తెలంగాణ రాష్ర్ట విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) ఆశించిన అభ్యసన ఫలితాలు సాధించిన ట్లవుతుంది.

డిజిటల్ యుగం.. అన్నీ సమస్యలే

డిజిటల్ యుగంలో కూడా పుస్తకాలకు ప్రత్యామ్నాయం లేదు. పుస్తక పఠనం జ్ఞానానికి మూలం, మన నిరంతర జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశం. ఒక నిర్దిష్ట పాఠశాలలోని పాఠ్యాంశాలు ఎక్కువగా లైబ్రరీ నాణ్యతపై ఆధారపడి ఉంటా యి. చక్కటి సౌకర్యాలతో కూడిన లైబ్రరీ లేకుండా బోధన, అభ్యాస ప్రక్రియ అధ్వానంగా ఉంటాయి. చదవడం అనేది మన సుకు వ్యాయామం.

ఇది పిల్లలు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి సహా యపడుతుంది. వారి మనస్సులను ప్రకాశవంతం చేయడానికి కొత్త జ్ఞానపు తలు పులు తెరుస్తుంది. చదవడం వల్ల పదజాలం మెరుగుపడుతుంది. మెరుగైన గ్రహణశక్తి, విమర్శనాత్మ ఆలోచనా నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. విశ్లేషణ నైపుణ్యాలను మెరుగుపరిచి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.

నూతన విద్యా విధానం 2020  ప్రకారం ప్రతి పాఠశాలలో గ్రంథాలయా లు లేదా పాఠశాలల్లో విద్యార్థులు పౌర గ్రంథాలయాలు ఉపయోగించుకునేందుకు అవకాశాలు కల్పిస్తామని, అందుకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తామని భారత ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో భాగంగా పుస్తకాలతో పాటు విద్యార్థులకు పుస్తక పఠనం అనే అంశాన్ని పాఠ్యాంశాల్లో చేర్చవలసిన అవసరం ఉన్న ది. ప్రాథమిక విద్యా స్థాయిలోనే ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకునేలా ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు కృషి చేయాల్సిన అవసరముంది.

పాశ్చాత్య దేశాల్లో మెరుగ్గా..

అభివృద్ధి చెందిన దేశాలైన యూరప్, అమెరికా తదితర దేశాల్లో గ్రంథాలయాలకు వెళ్తారు. అవకాశం ఉంటే తల్లిదం డ్రులు, కుటుంబ సమేతంగా వెళ్లి పుస్తకాలు చదువుతారు. చదవడం ఒక అల వాటు. గ్రంథాలయాలను సందర్శించడం ఒక పరిపాటి. కానీ మన దగ్గర విద్యార్థులు మాత్రం ఖాళీ సమయాల్లో, సెలవు దినాల్లో సినిమాలు, షికార్లు అంటూ తిరుగుతారు. మొబైల్ ఫోన్స్ పెరిగాకా రీల్స్, ఎలక్రానిక్ గాడ్జెట్స్‌తో కాలక్షేపం చేస్తున్నారు. అలా కాకుండా అమెరికా, న్యూజి లాండ్, ఫిన్లాండ్, ఇంగ్లండ్, కెనడా, సింగపూర్ దేశాల్లో పుస్తకాలు చదవడం గొప్పత నంగా భావిస్తారు. ఆంగ్ల బోధనలో పుస్తక పఠనం ఒక పాఠ్యాంశం.

పాఠశాలల్లో గ్రంథాలయాలు..

పాఠశాల గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు ఇతర కథలు, నవలలు, నాటకాలు, దేశభక్తి గేయాలు, పాటలు, ఆధ్యాత్మిక పుస్తకాలు, నిఘంటువులు, పద్యాల పుస్తకాలు ఉండటం వల్ల అవి చదివి విద్యార్థులకు విస్తృతమైన పఠనం చేయడానికి అవకాశం ఉంది. విద్యార్థులకు కావాల్సిన పోటీ పరీక్షలకు కావల్సిన మెటీరియల్స్, పుస్తకాలు అందుబాటులో ఉండడం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

విద్యార్థులకు పాఠశాల స్థాయిలో గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాలను చదివే అలవాటు కావడం వల్ల భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించడానికి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ర్ట విద్యా శాఖ, రాష్ర్ట విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) సంయుక్తంగా ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో, ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి, విద్యార్థులలో పఠన శక్తిని పెంపొందించడానికి చేస్తున్న కృషిపై విద్యార్థులు తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 వ్యాసకర్త సెల్: 9290826988