19-08-2025 11:50:50 PM
మా వార్డుకు ప్రత్యేక అధికారి జాడా లేదు
కనీసం బోరు మోటర్ ను రిపేరు చేయించడం లేదు
11వ వార్డు ప్రజల ఆవేదన
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): మా వార్డుకు ప్రత్యేక అధికారి రాక మాకు సమస్యలు ముఖ్యంగా తాగునీటి సమస్య గత మూడు రోజుల నుండి మిషన్ భగీరథ నీరు గాని, వార్డులో ఉన్న బోరు మోటర్ గాని పనిచేయక తీవ్ర అవస్థలు పడుతున్నామని అవార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని 11వ వార్డు లింగరెడ్డి పేట మహిళలు గత మూడు రోజుల నుండి మిషన్ భగీరథ నీరు, బోరు మోటర్ నుండి త్రాగునీరు రాక అవస్థలు పడుతున్నామని వార్డులో మహిళలు ప్రజలు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురపాలక సంఘంలో పలుమార్లు అధికారులకు విన్నవించిన శూన్యమేనని అన్నారు. కనీసం ప్రత్యేక అధికారులు మా వార్డ్ పై శ్రద్ధ వహించి మాకు త్రాగునీటి సమస్య తీర్చాలని మహిళలు తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు.