15-05-2025 12:00:00 AM
ఆదిలాబాద్, మే 14 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బోర్ వెల్స్ దందా ఇష్టారీతిన సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రజలు చెప్పినచో ట బోర్వెల్ యజమానులు చేతిపంపు కోసం రంధ్రాలు చేస్తూ రాత్రికి రాత్రే తమ పనుల ను కానిచ్చేస్తున్నారు. రోడ్ల మధ్యనే బోర్వెల్ రంధ్రాలను చేస్తూ బోర్వెల్ యంత్రాల నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వీటన్నింటిని పట్టించుకోవలసిన మున్సిపల్ అధికార యంత్రాంగం చూసిచూడనట్లు వ్యవహరిస్తోందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. చేతి పంపుల కోసం ఇష్టారీతిన ఎక్కడపడితే అక్కడ రంధ్రాలు చేయడంతో భూగర్భ జలా లు అడుగంటి పోయే ప్రమాదం నెలకొంది. పర్యవేక్షించాల్సిన మున్సిపల్, ఇతర సంబంధిత శాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవ హరించడంతో బోర్‌వెల్ యజమానుల దండ మూడు పువ్వలు ఆరు కాయలుగా కొనసాగుతోంది.
రోడ్ల మధ్యనే రంధ్రాలు..
వేసవి కాలం వచ్చిందంటే చాలు నీటికి కటకట ఏర్పాటు సహజం. ఇదే అదునుగా తీసుకొని ఇష్టారీతిన ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్ల మధ్యలో బోర్‌ల కోసం రం ద్రాలు చేస్తున్న పట్టించుకునే అధికారులే కారువైయ్యారు. ఆదిలాబాద్ జిల్లా కేం ద్రంలో ప్రజలు రాకపోకలు సాగించే రోడ్ల మధ్యనే చేతి పంపు కోసం రంద్రాలు చేస్తున్నారు.
ఇటీవల ఆదిలాబాద్ పట్టణంలోని వినాయక్ చౌక్‌లో చేతిపంపు కోసం రంద్రం చేశారు. తాజాగా గతరాత్రి భుక్తాపూర్ కాలనీలో ఏకంగా రోడ్ల మధ్యలోనే బోలెవెల్ రం ద్రం వేయడతో స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న మున్సిపల్ అధికారులు రోడ్డు మధ్యని వేసిన రంధ్రాన్ని పరిశీలించారు. దీనిపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు.
ఇష్టం వచ్చినంత లోతులు రంధ్రం...
చేతిపంపుల కోసం ఎలాంటి నియమ నిబంధనలు, ఎలాంటి అనుమతులు పాటించకుండానే బోర్వెల్ యజమానులు ప్రజలు చెప్పిన విధంగా వందల మీటర్ల లోతులో రంధ్రాన్ని చేస్తున్నారు. ఒక్కొక్క ప్రాంతం లోనైతే 500కు పైగా ఫిట్ల లోతులో రంద్రా లు చేయడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి.
వందల ఫీట్ల లోతుల్లో బోర్లు వేస్తున్నారు : బండారి సంతోష్ స్థానిక యువకుడు
ఆదిలాబాద్‌లో ఇష్టం వచ్చినట్లు రోడ్ల మధ్య లో, ఇతరత్న ప్రాంతా ల్లో వందల ఫీట్ల లోతు ల్లో బోర్‌లు వేస్తున్నారు. అధికారులు చర్య లు తీసుకోకపోకడంతో అటు ప్రజలు, ఇటు బోర్ వెల్స్ యజమానులకు హద్దుహదూపు లేకుండా పోతున్నాయి. 500 ఫీట్లకు పైగా లోతులోబోర్లు వేయడంతో భూగర్భ జలా లు అడుగంటిపోయి చుట్టూ పక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బోర్వెల్‌ని సీజ్ చేసి, కేసు నమోదు చేశాం: మున్సిపల్ కమిషనర్ రాజు
అనుమతులు లేకుండా రోడ్లపై బోర్లు వేస్తున్న బోర్ వెల్ యజమానులపై చర్యలు తీసుకుంటున్నాం. తాజాగా భూక్తాపూర్ కాలనీలో రోడ్డుపై బోర్ వేసిన బోర్వెల్‌ను సీజ్ చేసి వన్ టౌన్‌లో కేసు నమోదు చేశాం. అనుమతులు లేకుండా ఇష్టారీతిన బోర్లు వేస్తే కఠిన చర్యలు తప్పవు. బోరు వేయించుకునేవారు తప్పనిసరిగా మున్సిపల్ నుండి అనుమతులు పొందాల్సిందే, బోరువేసే బోర్వెల్ యజమానులు సైతం అనుమతి పత్రం ఉంటేనే బోర్లు వేయాలి.