04-08-2025 01:12:19 AM
ఐటీ ఉద్యోగుల హంగామా
- స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి
-టెస్టుల్లో అందరికీ పాజిటివ్
-ఆరుగురి అరెస్ట్.. ఎన్‌డీపీఎస్ కింద కేసు
- రూ.2 లక్షల డ్రగ్స్, మూడు లగ్జరీ కార్లు స్వాధీనం
- రంగారెడ్డి జిల్లా మేడిపల్లి సెరిన్ ఆర్చర్డ్స్ ఫామ్‌హౌస్‌లో ఘటన
చేవెళ్ల, ఆగస్టు 3: ఫామ్‌హౌస్‌లో మద్యం, డ్రగ్స్ పార్టీపై స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆర్సీపురం పరిధిలోని శ్వేత అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న అభిజిత్ బెనర్జీ, మౌలా లి పరిధి మారుతినగర్‌లోని శ్రీనిలయ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న గుండ సిం ప్సన్ రాడ్రిక్స్, అత్తాపూర్‌లో నివాసం ఉం టున్న పార్థ్ గోయల్, తిరుమలగిరి పరిధి ఆర్కేపురంలోని రోలింగ్ మెడోస్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న పల్లప్ప యశ్వంత్‌రెడ్డి, బోరబండలోని స్వరాజ్‌నగర్‌లో ఉండే సిల్వెస్టర్ సావియో రాస్, నల్ల కుంట పరిధి శంకర్ మఠ్ పక్కన పద్మకాలనీకి చెందిన డెన్నీస్‌జోసెఫ్‌తో పాటు నవీన్ సహదేవ్, ఇజాజ్ ఐటీ ఉద్యోగులు.
శనివారం అభిజిత్ బెనర్జీ బర్త్ డే ఉండటంతో మొయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామంలో ఉన్న సెరిన్ ఆర్చర్డ్స్ ఫామ్‌హౌస్‌ను బుక్ చేసుకున్నారు. ఖరీదైన మద్యంతో పాటు డ్రగ్స్ కూడా తెప్పించారు. రాత్రి సమయంలో అక్కడికి చేరుకొని మద్యం తాగుతూ.. డ్రగ్స్ సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న హైదరా బాద్ ఎస్‌టీఎఫ్ సీఐ భిక్షపతి, ఎస్సు బాలరాజు సిబ్బందితో కలిసి ఆదివారం తెల్లవా రుజామున 2:12 గంటలకు ఫామ్ హౌస్‌పై దాడులు నిర్వహించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
పట్టుబడ్డ ఐటీ ఉద్యోగులకు డ్రగ్స్ కిట్‌తో పరీక్షలు నిర్వహించగా అందరికీ పాజిటివ్ వచ్చింది. వీరి నుంచి రూ.2 లక్షల విలువైన 0.05 గ్రాముల ఎల్‌ఎస్‌డీ, 20.21 గ్రామాలు హషీష్‌తో పాటు బాలెంటైన్స్ బ్రాండ్ స్కా విస్కీ మూడు బాటిళ్లు, ఒక ఓపెన్ చేసిన జానీ వాకర్ బాటిల్, రూ.50 లక్షలు విలువైన మూడు లగ్జరీ కార్లు, ఐదు సెల్ పోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులతో పాటు పామ్ హౌస్ యజమా నిపైనా ఎన్‌డీపీఎస్, ఎక్సుజ్ చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. డ్రగ్స్, మద్యంతో పాటు ఆరుగురిని అరెస్ట్ చేసి చేవెళ్ల ఎక్సుజ్ పోలీస్ స్టేషన్‌లో అప్పజెప్పామని, మరో ఇద్దరు నవీన్ సహదేవ్, ఇజాజ్ పరారీలో ఉన్నారని వెల్లడించారు.