14-05-2025 11:19:24 PM
వరంగల్ (విజయక్రాంతి): మండుతున్న ఎండల నేపథ్యంలో ప్రజలే కాదు పశుపక్షాదులు తాగునీటికి అల్లాడుతున్నాయి. ఎండలు మండుతున్న నేపథ్యంలో గొంతు తడుపుకోవడానికి వరంగల్ రైల్వే స్టేషన్లో ఓ కోతి పడుకున్న కష్టాలు విజయక్రాంతి కెమెరాకు చిక్కాయి. ప్రయాణికుల కోసం ఏర్పాటుచేసిన తాగునీటి నల్లా నుంచి ప్రజలు తాగుతున్న వైనాన్ని చూసి తర్వాత ఓ కోతి అక్కడికి వచ్చి మనుషులు తిప్పినట్లుగానే నల్లా తిప్పి నీటితో గొంతు తడుపుకోగా, అదే తరహాలో వాటి వెనక మరికొన్ని కోతులు గొంతు తడుపుతున్నాయి