17 April, 2026 | 3:07 PM

ప్రమాణం చేశాడు... పనుల్లో నిమగ్నమయ్యాడు

17-02-2026 09:52 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డులో కౌన్సిలర్‌గా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన బాలకృష్ణ కాలనీ సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టారు. బాలకృష్ణ కాలనీలో పనిచేయని బోర్వెల్‌ను మంగళవారం మున్సిపల్ సిబ్బందితో మరమ్మతులు చేయించారు. ఎన్నో రోజులుగా బోర్వెల్ పని చేయకపోవడంతో ఎదురైన నీటి సమస్యను పరిష్కరించినందుకు కాలనీవాసులు కౌన్సిలర్‌ను అభినందించారు.