23-07-2025 11:00:59 PM
గద్వాల టౌన్: జోగులాంబ గద్వాల్(Jogulamba Gadwal) పట్టణ పరిధిలోని మున్సిపాలిటీ మెప్మా ఆధ్వర్యంలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఒక్క మార్పు అభివృద్ధికి మలుపు స్వచ్ఛపై తొలి అడుగు. మెప్మా మహిళా స్వయం సహాయక సభ్యులు ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని మహిళ ఆర్ధిక స్వశక్తితో ఆర్థికంగా బలోపేతం కావాలని మున్సిపల్ కమిషనర్ టి దశరథ్ కోరారు. బుధవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయము పరిసరాలలో స్ట్రీట్ వెల్డింగ్ జోన్ వద్ద మహిళా సంఘాలు తయారుచేసిన ఉత్పత్తులను సందర్శించారు.
పట్టణంలోని 37 వార్డుల నుంచి తరలివచ్చిన వివిధ రకాల వస్తువులు ఆహార పదార్థాలు వెదురు బుట్టలు మిల్లెట్ ఉత్పత్తుల 1 గ్రామ గోల్డ్, హోమ్ ఫుడ్ గారెలు, లడ్డులు, రాగి జావ లాంటి పలు ఆహార పదార్థాలను ప్రదర్శనలో పెట్టారు. ఈ సందర్భంగా మహిళలను కమిషనర్ టీ దశరథ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఈ గోపాల్, రాజేష్ కుమార్, మెప్మా సిబ్బంది జి వెంకటేశ్వర్లు ఎడిఎంసి నిజాముద్దీన్ తిమ్మన్న మహాలక్ష్మి,రిసోర్స్ పర్సన్ లు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.