calender_icon.png 24 July, 2025 | 8:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాలక్ష్మి పథకం కింద 200 కోట్ల మహిళల ప్రయాణం

23-07-2025 11:08:09 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్..

కామారెడ్డి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంలో 200 కోట్ల మహిళా ప్రయాణికులు ప్రయాణం చేశారని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్(District Collector Ashish Sangwan) అన్నారు. రూ. 6700 కోట్ల రూపాయలు 23 జూలై 2025 నాటికి ఆదా చేసుకున్న సందర్భంలో బుధవారం కామారెడ్డి బస్సు స్టేషన్ లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. మహాలక్ష్మి ఉచిత ప్రయాణంతో మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. పేద సామాన్య ప్రజలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, చైతన్య రెడ్డి, ఆర్డిఓ వీణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.  ఈ సమావేశంలో కామారెడ్డి డిపో మేనేజర్ కరుణ శ్రీ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో డిపో సూపర్వైజర్స్, స్టోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. రోజు ఉచిత ప్రయాణం చేసే మహిళా ప్రయాణికురాలకు బహుమతులతో పాటు శాలువాతో సన్మానించారు. స్కూల్ విద్యార్థులచే ముగ్గుల పొటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. వీటితో పాటు ఆరు స్పెషల్ టూర్ ప్యాకేజీ కరపత్రాలను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ కరుణశ్రీ, ఆర్టీసీ సిబ్బంది డ్రైవర్లు కండక్టర్లు పాల్గొన్నారు.