23-07-2025 11:24:24 PM
మునగాల: మండల పరిధిలోని బరకత్ గూడెం గ్రామంలో అంగన్వాడి సెంటర్ కి నిధులు మంజూరై ఆరునెలలు కావస్తున్న అనుకూలమైన స్థలం దొరకగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి(MLA Uttam Padmavathi Reddy) దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే గ్రామంలో ఉన్న పెద్దల సహకారంతో అమెరికాలో స్థిరపడిన 9 మందికి ఎమ్మెల్యే విషయం వివరించగా వెంటనే స్పందించి ఆరు లక్షల రూపాయలు అంగన్వాడి నిర్మాణానికి సహకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్, సిడిపిఓ పారిజాతం, అంగన్వాడి సూపర్వైజర్ బెజవాడ సరిత, సెక్రెటరీ శ్వేత, అలవా టీచర్ హమీద, జెట్టి రామిరెడ్డి, జెట్టి కోటిరెడ్డి, నరాల రుక్కారావు, పూర్ణ శంకర్, రాయిరాల సుమన్, ఓరుగంటి రవి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.