calender_icon.png 24 July, 2025 | 8:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నర్సిరెడ్డిగూడెం భూ నిర్వాసితులకు అండగా ఉంటాం

23-07-2025 11:11:37 PM

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..

చండూరు/మర్రిగూడ (విజయక్రాంతి): నర్సిరెడ్డిగూడెం భూ నిర్వాసితులకు అండగా ఉంటానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) అన్నారు. బుధవారం మునుగోడు క్యాంప్ కార్యాలయంలో శివన్న గూడెం ప్రాజెక్టు కింద ముంపున గురైన మర్రిగూడ మండల పరిధిలోని నర్సిరెడ్డిగూడెం భూ నిర్వాసితులకు 53 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మునుగోడు నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తానని, నియోజకవర్గ అభివృద్ధి కోసం మీ అస్తిత్వాన్ని త్యాగం చేశారని, నర్సిరెడ్డి గూడెంలోని ప్రతి నిర్వాసితునికి తాను అండగా ఉంటానని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పాశం సురేందర్ రెడ్డి, మండల పార్టీ నాయకులు చిట్యాల రంగారెడ్డి, వెంకటయ్య, నర్సిరెడ్డిగూడెం ముంపు బాధితులు తదితరులు పాల్గొన్నారు.