calender_icon.png 6 July, 2025 | 11:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వాయర్, చెక్ డ్యాంల పనుల పురోగతిపై బోథ్ ఎమ్మెల్యే ఆరా

05-07-2025 12:00:00 AM

ఇరిగేషన్ అధికారులతో సమీక్ష 

అదిలాబాద్, జూలై 4 (విజయక్రాంతి) : బోథ్ నియోజకవర్గంలో కొనసాగుతున్న 11 చెక్ డ్యాంల పనుల పురోగతులపై ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆరా తీశారు. ఆదిలాబాద్ పట్టణంలోని పెన్ గంగ భవన్ లో శుక్రవారం ఇర్రిగేషన్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు ప్రాజెక్ట్ ల పెండింగ్ సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. 

పిప్పల్ కోటి రిజర్వాయర్, దేగామ రిజర్వాయర్ భూ నిర్వాసితుల సమస్యలపై అధికారులను పలు అంశాలపై సమీక్షించారు. అనంతరం తేజపూర్, బుగ్గరాం, పిప్రి, లిఫ్ట్ ఇర్రిగేషన్లపై ఎమ్మెల్యే అరా తీశా రు. అదేవిధంగా ఆడిగామ, కజ్జర్ల, మత్తడి వాగు, చింతలబొరి, పురుషోత్తం పూర్, సీతాగొంది కేనాళ్ల మరమ్మతు పనులు ఎక్కడి వరకు వచ్చాయో అడిగి తెలుసుకున్నారు.

అదేవిధంగా సిరిచేల్మా దేవాల యం వద్ద, అలాగే మత్తడివాగు బ్రిడ్జిల నిర్మాణం, పిప్పల కోటి మరియు చనక కొరట ప్రాజెక్టుల భూ సేకరణపై ఆరా తీశారు. బోథ్ నియోజకవర్గంలో ఉన్న అన్ని పనులను వీ లైనంత త్వరగా పూర్తి చేయాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. నియోజకవర్గంలో నూతనంగా కావలసిన ప్రాజెక్ట్ అవసరాలపై ప్రతిపాదనలు పంపాలని అధికారులను  ఆదేశించారు.