05-12-2025 02:05:26 PM
హైదరాబాద్: శామీర్‌పేట ఓఆర్ఆర్(Shamirpet ORR) వద్ద కారులో భారీగా నగదు పట్టుబడింది. కారులో రూ. 4 కోట్ల హవాలా నగదు స్వాధీనం చేసుకున్నారు. కారు టైరు, సీట్ల కింద నగదును గుర్తించిన బోయిన్ పల్లి క్రైమ్ పోలీసులు(Bowenpally Crime Police) హవాలా ముఠాను అరెస్ట్ చేశారు. హవాలా ముఠాపై ఏడాదిగా నిఘా ఉంచినట్లు పోలీసులు తెలిపారు. గతంలో హవాలా కింద రూ.50 లక్షలకు రూ.60 లక్షలు ఇస్తానని ఓ వ్యక్తి ఒప్పందం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 2024లో పరారీలో ఉన్న వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసుల గాలిస్తున్నారు. రూ.4 కోట్ల నగదుతో నగరంలోకి వస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు విశ్వసనీయ వర్గాల సమాచారం అందింది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నిజామాబాద్ నుంచి వస్తుండగా శామీర్‌పేట వద్ద పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.