calender_icon.png 5 December, 2025 | 3:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీకెన్ వర్సిటీతో ఒప్పందాలు

05-12-2025 02:40:21 PM

ఆస్ట్రేలియా వర్సిటీతో ఒప్పందం

హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit)కు రావాలని అనేకమందిని ఆహానించామని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu ) సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. మన వర్సిటీలకు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరామని తెలిపారు. ఆస్ట్రేలియా వర్సిటీతో ఒప్పందం చేసుకుంటామని వివరించారు. ఆస్ట్రేలియాతో(Australia) మనకున్న సంబంధాలపై చర్చించామని తెలిపారు. ప్రపంచస్థాయి వర్సటీలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఇక్కడి యువతకు ఉపాధి పెరిగేలా చర్యలు చేపట్టామని వెల్లడించారు. ఏఐ సిటీ నిర్మాణం దిశగా చర్చించామన్నారు. అనేక ఏఐ శిక్షణా కేంద్రాలను ఇక్కడకు తెస్తున్నామని స్పష్టం చేశారు.

ఆస్ట్రేలియాలోని డీకెన్ వర్సిటీతో(Australia Deakin University) మాట్లాడామని చెప్పిన మంత్రి శ్రీధర్ బాబు త్వరలో ఒప్పందం చేసుకుంటామని వివరించారు. హెల్త్ కేర్, సెక్యూరిటీ, ఉత్పత్తి రంగాలపై డీకెన్ వర్సిటీ పరిశోధనలు చేస్తోందని తెలిపారు. ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటు దిశగా చర్చించామని సూచించారు. డీకెన్ వర్సిటీ అనుభవం(Deakin University Experience) మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతోందని తెలిపారు. విద్య, పరిశ్రమలు, నైపుణ్యాల పరంగా డీకెన్ వర్సిటీతో ఒప్పందాలు చేస్తామన్నారు. ఉన్నతవిద్య, పరిశోధనల కోసం అనేక మంది ఆస్ట్రేలియా వెళ్తున్నారని శ్రీధర్ బాబు వెల్లడించారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య మరిన్ని సంబంధాలు కోరుకుంటున్నామని తెలిపారు. ఫార్మా, ఎర్త్ సైన్సెస్ పరిశోధన, సృజనాత్మక రంగాల్లో  మంత్రి శ్రీధర్ బాబు సహకారం కోరారు.