2 July, 2026 | 2:59 PM

Breaking News

గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •  

బస్సు కిందపడి బాలుడి మృతి

22-06-2025 12:00 AM

జగద్గిరిగుట్ట ఆల్విన్ కాలనీలో ఘటన

కుత్బుల్లాపూర్, జూన్ 21: సైకిల్‌పై ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు స్కూల్‌బస్సు కిందపడి మృతి చెందిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బీహార్ రాష్ట్రానికి చెందిన ముఖేష్ చౌహన్ హైదరాబాద్‌కు కుటుంబంతో వలస వచ్చి జగద్గిరిగుట్టలో వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ముఖేష్ చౌహన్ కుమారుడు జైసిత్ చౌహన్(10) ఆల్విన్ కాలనీలోని జీవన్ జ్యోతి స్కూల్‌లో 4వ తరగతి చదువుతున్నాడు.

శుక్రవారం సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత స్నేహితులతో కలిసి ఆల్విన్ కాలనీలోని తులసినగర్‌లో సైకిల్‌పై ఆడు కుంటున్నాడు. అదే సమయంలో కేపీహెచ్‌బీ కాలనీ గోకుల్ ప్లాట్స్ నడుపుతున్న క్వాంటం లీఫ్స్ స్కూల్ బస్సు విద్యార్థులను దించేందుకు తులసీనగర్‌కు వచ్చింది.

సైకిల్‌పై ఆడుకుంటున్న బాలుడు అదుపుతప్పి ప్రమాదవశాత్తు బస్సు ముందు టైర్ల కింద పడ్డాడు. డ్రైవర్ గమనించకుం డా బస్సును పోనివ్వడంతో బాలుడికి తీవ్ర గాయాలై మృతి చెందాడు. తం డ్రి ముఖేష్ చౌహన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.