2 July, 2026 | 4:12 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

యోగా డేలో డిప్యూటీ మేయర్ శ్రీలతశోభన్‌రెడ్డి

22-06-2025 12:00 AM

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 21 (విజయక్రాంతి): గచ్చిబౌలిలో శనివారం ప్రభుత్వం అంతర్జాతీయ యోగా డే వేడుకలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, మంత్రులు రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్‌రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డితో పాటు సుమారు 5వేల మంది పాల్గొన్నారు. అన్నింటిలోకెల్లా గొప్ప సాధన యోగానేనని మంత్రి దామోదర అన్నారు. మారిన జీవనశైలిలో ఇది ఎంతో అవసరమని చెప్పారు. ఒత్తిడిని తొలగించి ధార్మిక చింతన పెంచుతుందని పేర్కొన్నారు.