calender_icon.png 22 August, 2025 | 1:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాక్టర్ కిందపడి బాలుడి మృతి

07-05-2025 09:47:27 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాండ్ల సంకీస గ్రామంలో ట్రాక్టర్ కిందపడి పోగుల ఉమేష్(17) బాలుడు దుర్మరణం పాలయ్యాడు. ఎస్సై వంశీధర్ కథనం ప్రకారం.. గులకరాళ్ళతో ఆగి ఉన్న ట్రాక్టర్ తిరిగి వెళ్లడానికి టైరు వద్ద ఉంచిన రాయిని తొలగించేందుకు ఉమేష్ ప్రయత్నిస్తుండగా ట్రాక్టర్ ముందుకు కదలడంతో అదే ట్రాక్టర్ కిందపడి తీవ్రంగా గాయపడి మృతి చెందాడని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.