calender_icon.png 8 May, 2025 | 1:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పథంలో తెలంగాణ: మంత్రి పొంగులేటి

07-05-2025 09:52:34 PM

భద్రాచలం (విజయక్రాంతి): గత పది సంవత్సరాలలో చేయని అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 నెలల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో దూసుకుపోతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. బుధవారం భద్రాచలంలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ బాలికల పాఠశాలలో రూ 25.5 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టిన ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ భోజనశాలను, భద్రాచలం పట్టణంలోని చర్ల రోడ్డులో 1.24 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టే అంతర్గత సిసి రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణానికి శంకుస్థాపన, గ్రంథాలయంలో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన రీడింగ్ రూమ్ ఆయన ప్రారంభించి సౌకర్యాలను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి పేదవానికి ఇందిరమ్మ ప్రభుత్వ హాయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు అందిస్తున్నామని, పేదవాళ్లే కావచ్చు ధనికులు కావచ్చు పది లక్షల రూపాయల వరకు పేదవాడికి జబ్బు చేస్తే రాజీవ్ ఆరోగ్య శ్రీ ఆరోగ్య కార్డు ద్వారా ఉచితంగా వైద్య సదుపాయం కల్పిస్తున్నామని, 500 రూపాయలకే ఉచిత గ్యాస్ పథకం, వాటితో పాటు రాజీవ్ యువ వికాస కార్యక్రమం ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నిరుద్యోగ యువకులకు 50 వేల నుండి 4 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం అందిస్తున్నామని, ప్రతి పేద కుటుంబాలు తృప్తిగా సన్న బియ్యం తోటే భోజనాలు చేయాలని ఉగాది పండుగ రోజున ఈ బహుత్తర కార్యక్రమాన్ని ప్రారంభించామని, మా ప్రభుత్వము వస్తే రైతులను రాజుని చేస్తామని వాగ్దానం చేశామని, అన్నమాట ప్రకారం 2 లక్షల రూపాయల వరకు రైతన్నలకు రుణమాఫీ చేశామని 25 లక్షల 65 వేల మందికి 687 కోట్ల రూపాయలని రైతు రుణమాఫీ చేసి సన్న వడ్లు పండించే రైతన్నలకు ఎకరానికి 500 రూపాయలు బోనస్ ఇచ్చిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు.

ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు అందించడానికి ప్రణాళికలు రూపొందించి ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నామని, ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏదైతే ఒక మైలురాయిగా పేదవాడికి కష్టంతో సంపాదించుకున్న భూములను భద్రత కల్పించే ఒక అద్భుతమైన భూభారతి చట్టం 2025 అంబేద్కర్ జయంతి నాడు ప్రారంభించి అనేక భూ సమస్యలను పరిష్కరించి రైతే రాజుగా ఉండేలా చర్యలు చేపడుతున్నామని, గత నెలలో కాశ్మీర్లో జరిగిన అల్లర్లను కేంద్ర ప్రభుత్వంలో మా ప్రభుత్వం అధికారంలో లేకపోయినా ప్రతిపక్ష పార్టీ అయినా దేశ ప్రజానీకానికి క్షేమం కొరకు అధికార పార్టీకి సపోర్టుగా నిలిచిన ఘనత మా కాంగ్రెస్ పార్టీకి ఉందని, యావత్ దేశ ప్రజలకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా కేంద్ర ప్రభుత్వానికి సపోర్టుగా నిలుస్తున్నామని అలాగే ఆపరేషన్ సింధూర్ కార్యక్రమంలో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు కల్పించడానికి తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి పూర్తి భద్రత కల్పించడానికి ముందున్నామని అన్నారు. 

ఈ కార్యక్రమంలో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ప్రాజెక్ట్ అధికారి బి రాహుల్, ఆర్డీవో దామోదర్ రావు, జిల్లా అధికారులు ఐటీడీఏ యూనిట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.