07-05-2025 09:42:01 PM
కాంగ్రెస్ పార్టీ 47 డివిజన్ అధ్యక్షుడు షేక్ అజ్గర్..
హనుమకొండ (విజయక్రాంతి): గ్రేటర్ వరంగల్ 47వ డివిజన్ కాజిపేట బాపూజీ నగర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు షేక్ అజ్గర్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదర్ సంజీవయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 47 డివిజన్ కాంగ్రెస్ పార్టీ దళిత నాయకుడు మైసారపు సిరిల్ లారెన్స్ మీడియాతో మాట్లాడుతూ.. 1972లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర్ సంజీవయ్య పనిచేశారని, రెండుసార్లు అఖిలభారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా పని చేశారని ఆయన సేవలను కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ తొలి దళిత అధ్యక్షునిగా 38 సంవత్సరాలు చిన్న వయసులో పనిచేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇప్ప శ్రీకాంత్, సిల్వేరు విజయభాస్కర్, తమ్ముడి మధు, తిరుపతి, శ్రీనివాస్, బొబ్బిలి నాగరాజు, అలీమ్ భాయ్, పోగుల శ్రీనివాస్, దార్ల రాజ్ కుమార్, మాతంగి స్వామి, భద్రయ్య, డిసి మౌళి, దుప్పటి శరత్, ప్రభాకర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.