7 August, 2026 | 2:47 AM

చెరువులో పడి బాలుడు మృతి

07-08-2026 01:40 AM

స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని ఆరోపణ

రామచంద్రపురం, ఆగస్టు 6 (విజయ్రకాంతి): స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంతో ఆరేళ్ల  బాలుడు చెరువులో పడి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీకారం వండర్ నెస్ట్ ప్లే స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్న షణ్ముఖ్ (6) స్కూల్ సమీపంలోని చెరువులో పడి మృతి చెందాడు.

ఈ ఘటన స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే జరిగిందని స్థానిక కాలనీవాసులు ఆరోపించారు. బాలుడు స్కూల్ నుండి బయటకు వెళ్లడం యాజమాన్యం గమనించలేదని తెలిసింది. బాలుడి మృతితో తల్లిదండ్రులు ఉదయ్ కుమార్, మనీష తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న కొల్లూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. బాలుడి మృతికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.